close

తాజా వార్తలు

‘OMG Daddy’ అంటున్న అల్లు అర్జున్‌

హైదరాబాద్‌: ‘నా స్టోరీ చెప్పలేను.. నా బాధకంతులేదు. ఈ డాడీలందరూ ఎందుకంత పీక్కుతింటున్నారు’ అని వాపోతున్నారు అల్లు అర్జున్‌. ఆయన కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు  నెటిజన్లను విశేషంగా అలరిస్తుండగా, ఇప్పుడు ముచ్చటగా మూడో పాట,  ‘ఓ మైగాడ్‌ డాడీ’ విడుదలైంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సాంగ్‌ టీజర్‌లో బన్ని పిల్లలు అయాన్‌, అర్హలు సందడి చేయగా, ఫుల్‌ సాంగ్‌లో అల్లు అర్జున్‌-అల్లు అరవింద్‌, పూజాహెగ్డే-ఆమె తండ్రి ఫొటో సహా చిత్ర బృందం వారి తండ్రుల ఫొటోలతో ఈ వీడియోను రూపొందించింది. 

కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన ఈ పాటను రోల్‌ రైడా, రాహుల్‌ సిప్లిగంజ్‌,  బ్లాజీ, రాహుల్‌ నంబియార్‌, రాబిట్‌ మ్యాక్‌లు ఆలపించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.