
తాజా వార్తలు
కారు డోరు తెరవాలన్నా, ఇంజిన్ ఆన్/ఆఫ్ చేయాలన్నా తాళం చెవి ఉండి తీరాల్సిందే. కానీ స్మార్ట్‌ఫోన్‌తోనే ఈ పనులన్నీ చేసే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) అనే టెక్నాలజీని హ్యుందాయ్ అభివృద్ధి చేసింది. దీనికోసం ముందు ఆన్లైన్ నుంచి కంపెనీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో మీరు వాడుతున్న కారు వివరాలు నమోదు చేయాలి. తర్వాత దీన్ని డోర్ దగ్గర పెట్టగానే తెరుచుకుంటుంది. డోర్ హ్యాండిళ్లలో అమర్చిన చిన్న ఎన్ఎఫ్సీ యాంటెన్నాకు యాప్‌లో నమోదు చేసిన గుర్తింపు సంకేతాలు అందగానే డ్రైవరు, ముందు ప్రయాణికుడి డోర్లు తెరుచుకుంటాయి. తర్వాత సెంటర్ కన్సోల్‌లో ఉండే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ దగ్గరకి స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లి, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్ నొక్కగానే కారు స్టార్ట్ అవుతుంది. ఈ డిజిటల్ కీ సదుపాయం అన్ని హ్యుందాయ్/కియా కార్లలో త్వరలోనే ప్రారంభిస్తామంటోంది హ్యుందాయ్. దీన్ని నలుగురు యూజర్లు ఉపయోగించేలా యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
