close

తాజా వార్తలు

కూల్‌గా వెళ్లొద్దాం

వేసవి అంటేనే ప్రయాణాల కాలం. ఎండలు మండిపోతున్నా రాజీపడటానికి మనసొప్పదు. సెలవులు తోడవ్వడంతో చిన్నదో, పెద్దదో విహారానికి సిద్ధమైపోతుంటారు. ఎండలు మండే వేళ ప్రయాణంలో ఉత్సాహం తగ్గొద్దన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా.. ఈ జాగ్రత్తలు పాటించండి. 
* ప్రయాణాల్లో పని ఒత్తిడి లేకపోవడంతో దృష్టంతా తిండి మీదే ఉంటుంది. ముందూవెనకా ఆలోచించకుండా స్ట్రీట్‌ఫుడ్స్‌ లాగించేస్తే మాత్రం సమస్యలు తప్పవు. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. 
* ద్రవరూపంలో దొరికే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. జ్యూస్‌లు, మిల్క్‌షేక్‌లు వంటివి ఎండవేడికి పులిసిపోయి త్వరగా పాడవుతుంటాయి. ఆకలికి తట్టుకోలేక ఆశపడ్డారా.. వినోదయాత్ర రసాభాసగా మారిపోయే ప్రమాదం ఉంది. 
* ఇంటి నుంచి పొడిగా ఉండే ఘనాహారాన్ని వెంట తీసుకెళ్లాలి. డ్రైఫ్రూట్స్‌ ప్యాక్‌ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు తాజా పండ్లు కొనుక్కోవడం మరచిపోవద్దు. 
* తక్కువ దూరాలు వెళ్తున్నప్పుడు లంచ్‌ కూలింగ్‌ ప్యాక్స్‌ అని మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిని నీటితో నింపి రాత్రంతా డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచాలి. తెల్లారి ఈ కూలింగ్‌ ప్యాక్స్‌ను లంచ్‌ బ్యాగ్‌లో ఉంచితే పండ్లు, జ్యూస్‌లు, సలాడ్స్‌వంటివి పాడవకుండా తాజాగా ఉంటాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.