
తాజా వార్తలు
దిక్సూచి
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా విసవిసలు తప్పనిసరిగా ఎదురవుతూ ఉంటాయి. అలాగని దానిని దాటడం పెద్ద కష్టమేం కాదు. కొన్ని నిబంధనలు తెలుసుకుని, వాటిని పాటిస్తే.. వీసా పొందడం సులభమే!
* విదేశీ పర్యాటకంలో భారతీయ పాస్‌పోర్ట్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. దాదాపు 55కు పైగా దేశాలు వీసా ఆన్ అరైవల్ అందిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ దేశాలకు విహారానికి వెళ్లాలంటే వీసా తప్పనిసరి. అన్ని దేశాలకూ టూరిస్ట్ వీసా దరఖాస్తు విధానం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. ధ్రువీకరణ పత్రాల విషయంలో వ్యత్యాసం ఉంటుంది.
* పాస్‌పోర్ట్ గడువు ఆరునెలలకు పైగా ఉండాలి.
* స్టాంపింగ్ కోసం వెళ్లినప్పుడు కవరింగ్ లెటర్ జతచేయాల్సి ఉంటుంది. అందులో పర్యాటకుడు ఆ దేశానికి ఎందుకు వెళ్తున్నాడనే విషయాన్ని వివరించాల్సి ఉంటుంది. వెళ్తున్నది విహారానికే అయినా.. కవరింగ్ లెటర్ ఆసక్తికరంగా ఉండేలా చూసుకోవాలి.
* కాన్సులేట్ కార్యాలయంలో దరఖాస్తు పత్రం ఇస్తారు. దానిని ఎవరికి వారే నింపాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో.. ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్లినా.. ఎవరి దరఖాస్తును వారే స్వహస్తాలతో నింపడం మంచిది.
* ఆదాయ ధ్రువీకరణ పత్రం, మూడు నుంచి ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్ నకలు దగ్గరుంచుకోవాలి.
* ఇటీవల దిగిన రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకెళ్లాలి (ఫొటో ఛాతీ వరకు కాకుండా మెడ వరకు ఉండేలా చూసుకోవాలి).
* ప్రయాణ ప్రణాళిక వివరాలను పొందుపరచాలి. ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నది, ఏఏ ప్రదేశాలు చూస్తున్నది, ఏ హోటల్లో బస చేస్తున్నది ఇలాంటి వివరాలన్నీ తెలియపరచాలి.
* ప్రయాణ బీమా తప్పనిసరిగా చేయించుకోవాలి.
* కొన్ని దేశాలు.. దరఖాస్తుదారులను పర్యాటకం కోసమే వెళ్తున్నారా లేదా అని సందేహిస్తాయి. వ్యక్తిగత ఆస్తులు, ఇన్‌కం టాక్స్ పత్రాలు, ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలు అడుగుతాయి. వాటికి సంబంధించిన పత్రాలు కూడా అప్లికేషన్‌తో జతచేయాల్సి వస్తుంది.
* సాధారణంగా 18-35 ఏళ్ల లోపున్న వారు.. ఒంటరిగా ట్రావెల్ వీసా దరఖాస్తు చేసుకుంటే.. అంత తేలిగ్గా ఆమోదం లభించకపోవచ్చు. టూరిస్ట్ వీసాపై వెళ్లి విదేశాల్లో ఉద్యోగాల్లో చేరడం, మానవ అక్రమ రవాణా తదితర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. వీరి విషయంలో ఒకటికి రెండుసార్లు పరీక్షిస్తారు. కుటుంబంతో గానీ, స్నేహితుల బృందంతో గానీ దరఖాస్తు చేసుకుంటే.. సులభంగా వీసా పొందవచ్చు.
* ప్రధాన నగరాల్లోనూ అన్ని దేశాల కాన్సులేట్లు అందుబాటులో ఉండవు. కానీ వీఎఫ్ఎస్ (వీసా ఫెసిలిటేషన్ సర్వీసెస్) కార్యాలయాల్లోనూ వీసా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ వీఎఫ్ఎస్ కేంద్రాలు ఉన్నాయి. కాన్సులేట్‌కు, వినియోగదారుడికి వారధిగా ఉంటాయివి. దరఖాస్తులను వీఎఫ్ఎస్ సిబ్బంది పరిశీలించి, అన్నీ సరిగ్గా ఉంటే.. కాన్సులేట్ ద్వారా ఆమోదం లభించేలా దోహదం చేస్తారు.
* వీసా ఇబ్బందులు ఉండకూడదంటే.. గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించవచ్చు. విదేశీ ప్యాకేజీలు బుక్ చేసుకుంటే.. ప్రత్యేక సేవల్లో భాగంగా వీసా ప్రక్రియ కూడా వాళ్లే చక్కబెడతారు.
- వాల్మీకి హరికిషన్ వాల్మీకి టూరిజం నిర్వాహకుడు
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- ఫ్యాన్ మృతిపట్ల చెర్రీ ఆవేదన..వీడియో వైరల్
- రేషన్ జాబితా నుంచి వారిని తొలగించొద్దు
- నాగేశ్వరరావు న్యాయం చేయలేడన్నారు!
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- వాహనాల విక్రయాలు.. మళ్లీ తగ్గాయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
