close

తాజా వార్తలు

Updated : 31/05/2019 05:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చుక్‌ చుక్‌ రైల్లో.. చక చక చల్లో 

దిక్సూచి

సిటీ బస్సులో ‘ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌’ టికెట్‌ తీసుకుంటే.. రోజంతా ఉచితంగా ప్రయాణించవచ్చు. బస్సులు మారినా.. రూటు మార్చినా.. టికెట్‌ తీసుకోవాల్సిన పనిలేదు. రైల్వేలోనూ ఈ సదుపాయం ఉంది. అదే సర్క్యులర్‌ జర్నీ టికెట్‌ (సీజేటీ). ఈ టికెట్‌ తీసుకుంటే.. రైలు ప్రయాణాన్ని మరపురాని తీర్థయాత్రగా మార్చవచ్చు.. అందమైన విహారయాత్రగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇంతకీ ఏమిటీ సీజేటీ?

సర్క్యులర్‌ జర్నీ టికెట్‌.. ఒక రకంగా రైలు పాస్‌లా పనిచేస్తుంది. ప్రయాణ ప్రణాళికను బట్టి ఈ టికెట్‌ ఇస్తారు. ఏకకాలంలో వెళ్లాల్సిన రైళ్లలో రిజర్వేషన్‌ చేస్తారు. ఫలితంగా ఏ ఆటంకాలు లేకుండా ప్రయాణం హాయిగా సాగిపోతుంది. నాన్‌ ఏసీ స్లీపర్‌ క్లాస్‌లో రిజర్వేషన్‌ కల్పిస్తారు.

ఎక్కడ తీసుకోవాలి? 
డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ను గానీ, స్టేషన్‌ మేనేజర్‌ (సికింద్రాబాద్‌ వంటి మేజర్‌ స్టేషన్లు)ను గానీ సంప్రదించి సీజేటీ తీసుకోవచ్చు.

ఎలా తీసుకోవాలి? 
ఈ టికెట్‌ తీసుకోవాలంటే ముందుగా యాత్రికులు తమ ప్రయాణ ప్రణాళిక లిఖిత పూర్వకంగా అధికారులకు అందజేయాలి. యాత్రికులు వెళ్లే ప్రాంతాలను బట్టి రైళ్ల అందుబాటును దృష్టిలో ఉంచుకొని సీజేటీ అందజేస్తారు.

టికెట్‌ ధర కన్నా తక్కువే! 
సీజేటీ ధర.. ఆయా ప్రాంతాలకు నేరుగా వెళ్లే రైళ్ల టికెట్‌ ధర కన్నా తక్కువగానే ఉంటుంది. యాత్రికులు వెళ్లే ప్రాంతాలను బట్టి ధరను నిర్ణయిస్తారు.

గుర్తుంచుకోండి 
* ఒకేసారి నాలుగైదు పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులు, భారీ విహారయాత్రలకు వెళ్లే వాళ్లకు అనుకూలం. 
* ప్రయాణ ప్రణాళికలో తెలిపిన ప్రాంతాల్లోనే రైలు దిగవలసి ఉంటుంది. మళ్లీ అక్కడి నుంచే బయల్దేరాలి. 
* సీజేటీలో తెలియజేసిన సమయంలోపు ప్రయాణం పూర్తి చేయాలి.

స్టాండర్డ్‌ రూట్లు 
రైల్వే శాఖ కొన్ని స్టాండర్డ్‌ సీజేటీ సర్వీసులు అందిస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్‌-విజయవాడ-అన్నవరం-పూరి- భువనేశ్వర్‌- టాటానగర్‌- గయా- వారణాసి- అలహాబాద్‌- హైదరాబాద్‌ ఇలా సుమారు 3946 కి.మీ. ప్రయాణం చేయవచ్చు. 
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని