close

తాజా వార్తలు

నలభీముల తండా!

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలోని ఈదమ్మ తండా ఓ విషయంలో చాలా ప్రత్యేకమైంది. అదేంటంటే ఆ ఊరి నిండా నలభీములే ఉన్నారు. అక్కడ ప్రతి ఇంట్లోనూ ఒక్కో వంట మాస్టర్‌ ఉంటారు. ఇక్కడ మొత్తం 73 కుటుంబాలుంటే ప్రతి ఇంట్లోనూ వంటలో నైపుణ్యం ఉన్న వ్యక్తి ఉంటారు. ఇరవై ఏళ్ల క్రితం ఈ తండావాసులు కూడా వ్యవసాయం, కూలి పనులు చేసుకుని బతికేవారు. వ్యవసాయం దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ ఉపాధి రంగాలపై దృష్టిసారించారు. ఈ క్రమంలో తండాలో చాలామంది వంట చేయడం నేర్చుకుని ఇప్పుడు మాస్టర్లయ్యారు. ప్రస్తుతం ప్రముఖ హోటళ్లలోని కిచెన్లలో సైతం వీరు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి హైదరాబాద్‌, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో చాలా శుభకార్యాలకు వీరిని ప్రత్యేకంగా వచ్చి తీసుకెళుతుంటారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.