
తాజా వార్తలు
దిల్లీ: మాజీ మంత్రి, ఆప్ తిరుగుబాటు నేత కపిల్ మిశ్రా భాజపాలో చేరారు. ఆప్ మహిళా విభాగం చీఫ్ రిచా పాండేతో కలిసి ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు, దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ సమక్షంలో వీరిద్దరూ ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కపిల్ మిశ్రా భాజపాకు అనుకూలంగా ప్రచారం చేశారు. దిల్లీలోని కార్వాల్‌నగర్ నుంచి ఆప్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన కపిల్ మిశ్రా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ఆయనపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద దిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయల్ ఇటీవల అనర్హత వేటు వేశారు. దీంతో తనపై అనర్హత వేటు వేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. గతంలోనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేయడంతో ఆయన భాజపాలో చేరతారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2017లో కపిల్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించారు. అప్పట్నుంచే కపిల్ మిశ్రా దిల్లీ భాజపా నేతలతో టచ్‌లో ఉంటూ వారితో కలిసి బహిరంగ వేదికల్లోనూ పాల్గొంటున్నారు. తాజాగా ఆయన భాజపాలో చేరారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- రివ్యూ: వెంకీ మామ
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
