
తాజా వార్తలు
ఇటీవల ఓ భారతీయ కుటుంబం బాలి పర్యటనకు వెళ్లింది. నాలుగు రోజులు సరదాగా గడిచిపోయాయి. వస్తూ వస్తూ బస చేసిన హోటల్ గదిలోని వస్తువులను తమ బ్యాగుల్లో సర్దేసి తిరుగు ప్రయాణమైంది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రావెలోకంలో భారతీయ పర్యాటకులపై రకరకాల వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. ‘ఏ దేశమేగినా.. మనజాతి గౌరవం నిలపాల’ని పెద్దల సందేశం. విదేశీ పర్యటనలకు వెళ్లే భారతీయుల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే..
* పర్యటించే దేశం సంప్రదాయాలను ముందుగానే తెలుసుకోవాలి.
* ఆయా దేశాలకు చెందిన సమాచారం, పర్యాటక విశేషాల గురించి అవగాహన ఉండాలి.
* ఆ దేశాల్లో నిషేధిత వస్తువులు ఏమిటో తెలిసుండాలి.
* వస్త్రధారణ విషయంలో స్థానిక విశ్వాసాలను గౌరవించాలి.
* మన దేశంలో మంచి అర్థాన్ని ఇచ్చే సంజ్ఞలు విదేశాల్లో చెడుగా అనిపించొచ్చు. గమనించుకోవాలి.
* దొంగతనానికి పాల్పడటం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం, అనవసరమైన చర్చల్లో పాల్గొనడం చేయకూడదు.
* స్థానిక చట్టాలను తెలుసుకోవడం మంచిది.
* బస చేసిన హోటల్ సిబ్బంది, కారు డ్రైవర్లతో మర్యాదగా మాట్లాడాలి.
* మన దుష్ప్రవర్తన మన సంస్కృతికి చెడ్డపేరు తెస్తుందని మరచిపోవద్దు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
