
తాజా వార్తలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకప్పుడు చాయ్‌వాలా అని అందరికీ తెలిసిందే! వడ్నగర్ రైల్వేస్టేషన్లో చాయ్ అమ్మేవాడినని మోదీ చాలా సందర్భాల్లో చెప్పుకొన్నారు. ఆయన చాయ్ అమ్మిన టీ కొట్టుకు ఇప్పుడు మహర్దశ పట్టింది. చాయ్ దుకాణాన్ని పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. వడ్నగర్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రేకుల కొట్టును పునర్నిర్మించాలని భావించింది. అయితే ఆనాటి జ్ఞాపకాన్ని అలాగే పదిలంగా ఉంచాలని భావించి.. టీకొట్టును కదపకుండా చుట్టూ అద్దాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిని పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్ది స్ఫూర్తి కేంద్రంగా మలుస్తామని గుజరాత్ పర్యాటక శాఖ చెబుతోంది. మరోవైపు మోదీ కేదార్‌నాథ్‌లో ధ్యానం చేసిన గుహకూ పర్యాటకులు క్యూ కడుతున్నారు. కేదారనాథుడి దర్శనం తర్వాత ఆ గుహకు వెళ్లి చూసొస్తున్నారు. కొందరైతే అక్కడ ధ్యానం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారు. గుహలో ఫోన్, స్నానాల గది, కరెంట్, బస సౌకర్యం ఉంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- కిర్రాక్ కోహ్లి
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
