close

తాజా వార్తలు

సివిల్స్‌కు ఇవీ ప్రధానం!

సివిల్స్‌కు ఇవీ ప్రధానం!

కొద్దిరోజుల్లో సివిల్స్‌ ప్రధాన (మెయిన్‌) పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంతవరకూ సుదీర్ఘంగా కొనసాగించిన సన్నద్ధతను పరామర్శించుకోవడం, పునశ్చరణ చేసుకోవడం ఇప్పటి కర్తవ్యం. ఇందుకు తోడ్పడే మార్గదర్శకాలు...

 ప్రధానపరీక్షలోని పేపర్లూ, మార్కుల పంపిణీని పరిశీలిస్తే అన్ని పేపర్లకూ సమాన వెయిటేజి ఉన్నట్టు తెలుస్తుంది. మొదటి మూడు పేపర్లలో 20 నుంచి 25 ప్రశ్నలున్నాయి. ప్రతి ప్రశ్నకూ 10 మార్కులు గానీ, 12.5 మార్కులు గానీ కేటాయించారు. సన్నద్ధత తుదిదశకు చేరిన ఈ తరుణంలో ఒక్కో పేపర్‌ను విశ్లేషించి, ఒక వ్యూహాన్ని రూపొందించుకుందాం. 

అర్హత పేపర్లు

ఇవి రెండున్నాయి. ఒకటి- మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌; రెండోది ఇంగ్లిష్‌. యూపీఎస్‌సీ ఇచ్చిన సమాచారం ప్రకారం- ప్రతి అభ్యర్థీ వీటిలో కనీసం 25 శాతం (75 మార్కులు) చొప్పున తెచ్చుకోవాలి. అర్హత మాత్రమే కదా అని తేలిగ్గా తీసుకోకూడదు. 2013, 2014 సంవత్సరాల్లో ఈ పేపర్లలో ప్రశ్నలు గతంలో కంటే కఠినంగా వచ్చాయి. కొందరు ఉత్తీర్ణులు కూడా కాలేకపోయారు. అందుకని అతి విశ్వాసం చూపకుండా ఈ పేపర్లను శ్రద్ధగా రాయాల్సిందే.

గతంలో కొంతమంది అభ్యర్థులు ‘పాసవుతాంలే’ అనే ధీమాతో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించారు. 200 మార్కులకు మాత్రమే రాసి వదిలేశారు. కానీ వారి అంచనా తప్పింది. తగిన మార్కులు రాక అర్హత పొందలేకపోయారు. అభ్యర్థులు ఇలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తపడాలి.

జనరల్‌ ఎస్సే
పరీక్షావిధానంలో మార్పు వచ్చాక జనరల్‌స్టడీస్‌ పేపర్లలో స్కోరింగ్‌ బాగా తగ్గిపోయింది. యూపీఎస్‌సీ జీఎస్‌లో మార్కులు ఇవ్వడంలో సంప్రదాయ పద్ధతినే పాటించాలనే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కులు పెంచుకుని, మెరిట్‌ జాబితాలో స్థానం పొందటానికి తోడ్పడే ఎస్సే, ఆప్షనల్‌ పేపర్లకు ప్రాధాన్యం పెరిగింది. 2013లో ఒక టాపిక్‌ ఇచ్చారు కానీ, 2014 పేపర్లో రెండు ఎస్సేలను అడిగారు. ఈ ధోరణి కొనసాగవచ్చు.

ప్రతి వ్యాసమూ 1000 నుంచి 1200 పదాల్లో రాయాల్సివుంటుంది. ఎనిమిది అంశాలను రెండు సెట్లుగా విభజిస్తారు. ఒక్కో సెట్‌ నుంచి ఒక అంశాన్ని ఎంచుకోవాల్సివుంటుంది. మొదటి సెట్‌లో జనరల్‌ టాపిక్స్‌ (పాఠశాల స్థాయిలో ఎదురయ్యే అంశాలు), రెండో సెట్‌లో భారత్‌కూ, భారత్‌లోని వర్తమాన అంశాలకూ సంబంధించిన అంశం ఉంటాయి. ప్రతి అంశంలోనూ విభిన్న కోణాలుంటాయి. వీటిలో కనీసం నాలుగు ప్రధాన వాదనలూ, వాటిని బలపరిచే వివరాలూ, ఉదాహరణలతో అభ్యర్థి వ్యాసం రాయాల్సివుంటుంది.

కొన్ని మెలకువలు
* జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1లో భౌగోళిక శాస్త్రం (జాగ్రఫీ) ప్రశ్నలతో పరీక్షను ఆరంభించటం మేలు. ఇవి వాస్తవాంశాలతో ఉంటాయి కాబట్టి అధిక మార్కులొస్తాయి. జాగ్రఫీ నుంచి సంస్కృతి, చరిత్ర ... ఆ తర్వాత ఇండియన్‌ సొసైటీ ప్రశ్నలు రాయటం మేలు.

* ఏ ప్రశ్న అయినా ఒక భాగంగా ఉన్నదానికంటే రెండు భాగాలుగా ఉన్నదే ఎక్కువ మార్కులను అందిస్తుంది.

* జాగ్రఫీ ప్రశ్నలను మినహాయిస్తే మిగిలినవన్నీ పరోక్షంగా, విశ్లేషణాత్మకంగా ఉంటాయి. పరోక్ష ప్రశ్నలను పరిచయంతో మొదలుపెట్టి పాయింట్లను విశ్లేషించి, భవిష్యత్తు ప్రస్తావన చేయాల్సివుంటుంది.


‘‘గతంలో కొంతమంది అభ్యర్థులు ‘పాసవుతాంలే’ అనే ధీమాతో మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌, ఇంగ్లిష్‌ పేపర్లను కాస్త నిర్లక్ష్యంగా రాశారు. కానీ వారి అంచనా తప్పి, తగిన మార్కులు రాక అర్హత పొందలేకపోయారు. అభ్యర్థులు ఇలాంటి పొరపాటు చేయకూడదు.’’

 

* గత రెండు సంవత్సరాల్లో జరిగిన పరీక్షల్లో అభ్యర్థులు మొదటి మూడు పేపర్లలో అన్ని ప్రశ్నలకూ జవాబులు రాయలేకపోయారు. బాగా నమ్మకంతో ఉన్నవాటిని మాత్రమే రాసినవారికంటే ఎక్కువ ప్రశ్నలను అటెమ్ట్‌ చేసినవారికే ఎక్కువ మార్కులు వచ్చాయి. (నాణ్యతతో పాటు పరిమాణం కూడా ముఖ్యమేననే సూచనను గ్రహించాలి). కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలకు జవాబులు రాయటం ఉత్తమం.

* ఇతర పరీక్షల మాదిరిగానే చాలా బాగా వచ్చిన ప్రశ్నతో ఈ సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షను ఆరంభించండి. ప్రతి జవాబుకూ నిర్దిష్ట స్థలం కేటాయించి ఉంటుంది కాబట్టి ఏ క్రమంలో రాస్తూవెళ్ళినా తేడా ఉండదు.

* సమయం గురించిన దృష్టి ఉండాలి. 25 ప్రశ్నలుంటే సాంకేతికంగా ఒక్కో ప్రశ్నకు జవాబు రాయటానికి 7.2 నిమిషాల వ్యవధే ఉంటుంది. అందుకని ప్రతి 15 నిమిషాలకోసారి బీప్‌ ఇచ్చేలా రిస్ట్‌ వాచ్‌ను అమర్చుకోవచ్చు. దీనివల్ల ఎంత వేగంగా రాయాలీ, మిగిలిన ప్రశ్నలకు ఎంత వ్యవధి ఉన్నదీ అనేదానిపై స్థూలంగా ఒక అవగాహన వస్తుంది. ఇదంతా ఇంటిదగ్గరే అమర్చుకోవాలని గుర్తుపెట్టుకోండి. పరీక్షకేంద్రం చేరుకున్నాక ఇలాంటివాటికి సమయం మిగలదు.

* పరీక్ష ముందటి రోజు రాత్రంతా చదువుతూవుండిపోకూడదు. పరీక్ష రోజు మెదడు తాజాగా ఉండాలి. ఇలా రాత్రి నిద్రపోకుండా చదివిన విద్యార్థులు తాము పరీక్షలో సమాధానాలు రాసేటపుడు తార్కికంగా ఆలోచించలేకపోయామనే అనుభవాలను చెపుతుంటారు.

* అనూహ్యమైన ప్రశ్నలు రావొచ్చనే అంచనాతో ఉండాలి. ప్రశ్నల తీరులో ఎలాంటి ముందస్తు వూహలూ పనిచేయకూడదని అలఘ్‌ కమిటీ సూచించింది. యూపీఎస్‌సీ ఈ సిఫార్సును అనుసరిస్తే ప్రశ్నల సంఖ్యలో కూడా మార్పులు ఉండే అవకాశముంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.