close

తాజా వార్తలు

గుజరాత్‌లో 10శాతం రిజర్వేషన్ల అమలు ఎప్పుడంటే

 నిర్ణయించిన ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ

గుజరాత్‌లో 10శాతం రిజర్వేషన్ల అమలు ఎప్పుడంటే

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లను జనవరి 14 నుంచి అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విద్య, ప్రభుత్వోద్యోగాల్లో అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో పార్లమెంటు ఆమోదం పొందిన బిల్లుపై శనివారమే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా రూపాంతరం చెందింది.

పార్లమెంటులో 124వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఆమోదం పొందిన ఈ బిల్లు, రాష్ట్రపతి ఆమోదంతో 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా రూపాంతరం చెందింది. జనరల్‌ విభాగంలోని పేదలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజ్యాంగంలోని 15, 16 అధీకరణాలను సవరించి సంబంధిత నిబంధనలను చేర్చారు. దీనివల్ల రాష్ట్రాలు ఈ రిజర్వేషన్లు అమలు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.

అయితే, చట్టంగా మారిన ఈ అంశం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై కేంద్ర సామాజిక న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంది. చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారుచేస్తూ ఆ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నుంచి ఇది కార్యరూపంలోకి రానుంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.