close

తాజా వార్తలు

ఆ ఇద్దరు మహిళలకు 24/7 రక్షణ కల్పించండి

ఆ ఇద్దరు మహిళలకు 24/7 రక్షణ కల్పించండి

దిల్లీ: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు బిందు, కనకదుర్గలకు 24/7 రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయంలోకి ప్రవేశించినందుకు తమకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ ఆ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం బిందు, కనకదుర్గలకు రక్షణ కల్పించాలని ఆదేశించింది.

బిందు, కనకదుర్గలు ఆలయంలోకి వెళ్లి వచ్చినప్పటి నుంచి వారికి బెదిరింపులు ఎదురవుతున్నాయి. దీంతో భయపడి వారు ఇంటికి కూడా వెళ్లలేదు. దాదాపు రెండు వారాల పాటు ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో దాక్కొన్నారు. ఎట్టకేలకు జనవరి 15న కనకదుర్గ ఇంటికి వెళ్లగా, ఆమె అత్త కనకదుర్గపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో ఆస్పత్రిలో చేర్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో బిందు, కనకదుర్గలు తమకు ప్రాణ హాని ఉందని గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. అలాగే ఆలయంలోకి వెళ్లాలనుకునే మహిళలకు పోలీసు రక్షణ కల్పించేలా కోర్టు ఆదేశించాలని కోరారు. వీరి పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టాలని వీరి తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ను కోరారు.

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల భద్రత కల్పించింది. కానీ భక్తులు, ఆందోళనకారులు మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. జనవరి 2వ తేదీన బిందు, కనకదుర్గలు ఎట్టకేలకు ఆలయంలోకి వెళ్లగలిగారు. దీంతో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.