close

తాజా వార్తలు

చైనా దూసుకెళ్తోంది.. అప్రమత్తం కావాలి

ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌  

చైనా దూసుకెళ్తోంది.. అప్రమత్తం కావాలి

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌కు ఉత్తరం వైపు ఉన్న విరోధి.. కృత్రిమ మేధ, బిగ్‌ డేటా అనలిటిక్స్‌, సైబర్‌ యుద్ధ సాంకేతికతలపై భారీగా ధనాన్ని ఖర్చు చేస్తూ దూసుకెళ్తోందని.. మనం వెనకబడకూడదంటే రక్షణ రంగంలో వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని ఆర్మీఛీఫ్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగంలో స్వావలంబన అనే అంశంపై హైదరాబాద్‌లో జరిగిన రెండ్రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. సైబర్‌ యుద్ధాలను ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధ, బిగ్‌ డేటా సాంకేతికత అవసరాన్ని గుర్తించామని, దీన్ని సాయుధ వ్యవస్థల్లో ప్రవేశపెట్టడంపై దృష్టి సారించామన్నారు. సరిహద్దు అవతల ఉండే శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు శాటిలైట్‌ నిఘావ్యవస్థ ఒక్కటే సరిపోదని డ్రోన్లు, మానవరహిత వాహనాలు, రిమోట్‌ వాహనాల అవసరం ఉందన్నారు. సమావేశంలో మేజర్‌ జనరల్‌ ఏబీ గోర్తి, లెఫ్టినెంట్‌ జనరల్‌ డీబీ షేకత్కర్‌, సెక్రటరీజనరల్‌ బాల్‌ దేసాయ్‌, కెప్టెన్‌ సంజయ్‌, వి.ఎస్‌.హెగ్డే తదితరులు పాల్గొన్నారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.