Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 47689
            [news_title_telugu_html] => 

ఘనతకు గణితం మార్కుల రసాయనం

[news_title_telugu] => ఘనతకు గణితం మార్కుల రసాయనం [news_title_english] => [news_short_description] => వందకు వంద వడ్డించి టాప్‌ ర్యాంకు ఘనతను కట్టబెట్టగలిగింది గణితం. సమీకరణాలకు సానపెట్టి సరైన కెమిస్ట్రీని సాధిస్తే మంచి మార్కులను ఇస్తుంది రసాయన శాస్త్రం. ఈ రెండు సబ్జెక్టులను ఎలా చదువుకుంటే చక్కటి స్కోరు సాధించవచ్చో చెబుతున్నారు నిపుణులు. [news_tags_keywords] => skills, inter exams, chemistry, mathematics, chaduvu, special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-01-24 00:31:50 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఘనతకు గణితం మార్కుల రసాయనం - EENADU
close

తాజా వార్తలు

ఘనతకు గణితం మార్కుల రసాయనం

ఇంటర్‌ పరీక్షల సన్నద్ధత

ఘనతకు గణితం మార్కుల రసాయనం

వందకు వంద వడ్డించి టాప్‌ ర్యాంకు ఘనతను కట్టబెట్టగలిగింది గణితం. సమీకరణాలకు సానపెట్టి సరైన కెమిస్ట్రీని సాధిస్తే మంచి మార్కులను ఇస్తుంది రసాయన శాస్త్రం. ఈ రెండు సబ్జెక్టులను ఎలా చదువుకుంటే చక్కటి స్కోరు సాధించవచ్చో చెబుతున్నారు నిపుణులు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఈ సలహాలు, సూచనలతో తమ ప్రిపరేషన్‌కు మరింత పదునుపెట్టుకోవచ్చు.

కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం)

ఘనతకు గణితం మార్కుల రసాయనం

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రసాయన శాస్త్రంలో అత్యధిక మార్కులు స్కోరు చేయటానికి కొన్ని మెలకువలు పాటించాలి. మొదట గమనించాల్సింది... పూర్తి సిలబస్‌ మీద సరైన అవగాహన అవసరం. అన్ని పాఠ్యాంశాలనూ 2 మార్కులు, 4 మార్కులు, 8 మార్కుల ప్రశ్నలుగా విభజించి ఎంపిక చేసుకుని చదవాలి.

8 మార్కుల ప్రశ్నలు పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, రసాయన బంధంలోనుంచి మాత్రమే రావడానికి అవకాశాలు ఎక్కువ. 4 మార్కుల ప్రశ్నలు స్టేట్స్‌ ఆఫ్‌ మ్యాటర్‌ (పదార్థాల స్థితి, స్టాయికియోమెట్రి, ఉష్ణగణిత శాస్త్రం (thermodynamics)హైడ్రోజన్‌- దాని సమ్మేళనాలు, రసాయన సమతాస్థితి, అయానిక సమతాస్థితి, కర్బన రసాయన శాస్త్రం నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ.

8 మార్కుల ప్రశ్నలు మూడింటిలో రెండు మాత్రమే రాయాలి కాబట్టి బాగా తెలిసిన 2 ప్రశ్నలను ఎంచుకోవాలి. సుమారు 250 పదాలతో రెండు మూడు పేజీల్లో   కూలంకషంగా అవసరమైనచోట డయాగ్రామ్స్‌ (పటం) వేసి సమాధానం రాయాలి. ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకొని దానికి కావలసిన సమాధానం మాత్రమే రాయాలి. ఇక్కడ అదనపు ప్రశ్నకు సమాధానం రాయాలని ప్రయత్నించకూడదు.

4 మార్కుల ప్రశ్నల్లో 8 ప్రశ్నలకుగాను 6 ప్రశ్నలు మాత్రమే రాయాలి. బాగా తెలిసిన 6 ప్రశ్నలకు 50 నుంచి 60 పదాల్లో రాయాలి. ఒకవేళ సమయం మిగిలివుంటే అదనపు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఎందుకంటే ఎగ్జామినర్‌ ఈ ప్రశ్నల్లో బాగా రాసిన అంటే.. ఎక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నలను పరిగణనలోనికి తీసుకుంటారు. అందుకని అధిక మార్కులు వచ్చే అవకాశం ఉంది.

2 మార్కుల ప్రశ్నల్లో చాయిస్‌ లేదు. 10 ప్రశ్నలూ సరిగ్గా రాస్తేనే 60 మార్కులు వస్తాయి. పాఠ్యాంశాలూ పూర్తిగా చదవాలి.

ప్రథమ సంవత్సరంలో..
* అకాడమీ పుస్తకాల్లో పాఠ్యాంశం చివరున్న అన్ని రెండు మార్కుల ప్రశ్నలూ జాగ్రత్తగా చదివితే గరిష్ఠ మార్కులు తెచ్చుకోవడం సులభమే. 2 మార్కుల ప్రశ్నలు- ఎన్విరాన్‌మెంట్‌ కెమిస్ట్రీ, యస్‌ బ్లాక్‌, పి-బ్లాక్‌ నుంచి దాదాపు 6 ప్రశ్నల వరకు అడిగే అవకాశం ఉంటుంది. అయానిక సమతాస్థితిలో పీహెచ్‌ ప్రాబ్లమ్స్‌మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అకాడమీ పుస్తకంలో వెనుక వైపున ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను బాగా సాధన చేయాలి.

ద్వితీయ సంవత్సరంలో...
* కర్బన రసాయన శాస్త్రం నుంచి 16 మార్కులుంటాయి. కాబట్టి ఈ విభాగం మీద ఎక్కువ దృష్టి సారించాలి. దీనిలో వచ్చే అన్ని Named Reactions ( బాగా సాధన చేయాలి. కార్భాక్సిలికామ్లాల ఆమ్లత్వం, అమైన్స్‌ క్షారత్వం ఆర్ధ్రతను సాధన చేయాలి. ద్రావణాలు, లోహసంగ్రహణ శాస్త్రం, ఉపరితల రసాయన శాస్త్రం, సంక్లిష్ట సమ్మేళనాలు, జీవ అణువులనుంచి 4 మార్కుల మీద ఎక్కువ సాధన చేయాలి. పాలిమర్స్‌, నిత్యజీవితంలో రసాయనశాస్త్రం, ఘన స్థితి ద్రావణాలు, లోహ సంగ్రహణ శాస్త్రం, సంక్లిష్ట సమ్మేళనాల నుంచి 2 మార్కులమీద ఎక్కువ సాధన చేయాలి. వీలైనంత వరకు 2 మార్కుల సమాధానాలు వరుస క్రమంలో రాయటం మేలు.

- టి. లక్ష్మీనారాయణ

మేథమేటిక్స్‌ (గణితశాస్త్రం)

ఘనతకు గణితం మార్కుల రసాయనం

ఇంటర్మీడియట్‌ విద్యార్థులు గణితంలో 75 మార్కులు చాలా సులభంగా సాధించవచ్చు. 7 మార్కుల ప్రశ్నల్లో బాగా తెలిసినవి 5 ప్రశ్నలు ఎంచుకుని సమాధానాలు రాయాలి (50 నిమిషాలు)  4 మార్కుల ప్రశ్నల్లో బాగా తెలిసినవి 5 ఎంచుకుని సమాధానాలు రాయాలి (40 నిమిషాలు)  2 మార్కుల ప్రశ్నలన్నింటినీ వరుసక్రమంలో రాయడానికి ప్రయత్నించాలి (40 నిమిషాలు) పై మూడింటినీ ఏదో క్రమంలో పూర్తిచేసిన తరువాత మిగిలిన 7 మార్కుల ప్రశ్న ఒకటి, 4 మార్కుల ప్రశ్న ఒకదానికి సమాధానం ఇవ్వండి (15 నిమిషాలు)  చివరగా మిగిలిన 7, 4 మార్కుల ప్రశ్నలను సాధించండి (15 నిమిషాలు). చివరగా 2 మార్కుల ప్రశ్నల సమాధానాలను పరిశీలించుకోవాలి (20 నిమిషాలు).

మొదటి సంవత్సరంలో..
* మ్యాథ్స్‌- 1ఎలో మంచి మార్కులు సాధించాలంటే ముందుగా మాత్రికలు చూసుకోవాలి. ఈ అధ్యాయానికి 22 మార్కుల వెయిటేజీ ఉంది. దీని నుంచి రెండు 7, ఒక 4, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ‌ సదిశల నుంచి ఒక 7, రెండు 4, మూడు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మొత్తం మార్కులు 21. మేయాలు వెయిటేజీ 11 మార్కులు. ఒక 7, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. దీని నుంచి సిద్ధాంతాలు ముఖ్యమైనవి. తరువాత సులభమైన అధ్యాయం గణితానుగమనం. దీని నుంచి 7, 4 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పున వస్తాయి.  ఆపై త్రికోణమితీయ నిష్పత్తులు, త్రికోణమితీయ పరివర్తనలు చదవాలి. దీని వెయిటేజీ 15 మార్కులు. దీని నుంచి 7, 4 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పున, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.  ఆ తర్వాత త్రిభుజ ధర్మాలు చదవాలి. దీని వెయిటేజీ 11 మార్కులు. 7, 4 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పున వస్తాయి.  దీని తరువాత త్రికోణమితీయ సమీకరణాలు, విలోమ త్రికోణమితీయ ప్రమేయాల నుంచి ఒక్కొక్కటి చొప్పున 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ‌ చివరగా 2 మార్కుల కోసం అతి పరావలయ ప్రమేయాలు చదివితే సరిపోతుంది.

మొదటి సంవత్సర విద్యార్థులు కష్టంగా భావించే సబ్జెక్టు 1బి. కానీ ప్రణాళిక ప్రకారం చదివితే మంచి మార్కులు సాధించవచ్చు.  బీ  ముందుగా నిరూపక జ్యామితిలోని సరళరేఖలతో సన్నద్ధత ప్రారంభించాలి. దీనికి 15 మార్కుల వెయిటేజీ ఉంది. రెండు 2 మార్కుల ప్రశ్నలూ, 7, 4 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పునా వస్తాయి. బీ ఆ తరువాత సరళరేఖ యుగ్మాలు చూసుకోవాలి. దీని నుంచి రెండు ఏడు మార్కుల ప్రశ్నలు వస్తాయి. దీనిలో మొదటి భాగం (మొదటి రెండు అభ్యాసాలు)లో వరకు ఒక ప్రశ్న, రెండో భాగం (మూడో అభ్యాసం) నుంచి రెండో ప్రశ్న వస్తుంది. బీ త్రిపరిమాణ జ్యామితిలో 3 అధ్యాయాలుంటాయి. 1. త్రిపరిమాణ నిరూపక వ్యవస్థ (దీనికి 2 మార్కులు) 2. దిక్‌ కొసైన్‌లు, దిక్‌ నిష్పత్తులు (7 మార్కులు) 3. తలాలు (2మార్కులు) బీ తరువాత కలన గణితాన్ని మొదలుపెట్టాలి. దీని నుంచి రెండు 2 మార్కుల ప్రశ్నలు, 4, 7 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 15 మార్కులకు వస్తాయి. బీ ఇప్పుడు స్పర్శరేఖలు, సరళ రేఖలు, అభిలంబ రేఖలను ఎంచుకోవాలి. దీని నుంచి 4, 7 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పున వస్తాయి. మొత్తం వెయిటేజీ 13 మార్కులు. ఇక్కడి వరకూ ఆరు 7 మార్కుల ప్రశ్నలు అయ్యాయి. బీ తరువాత 4 మార్కుల కోసం బిందు పథం, అవధులు అవిచ్ఛిన్నత, పైన చెప్పినవీ చూసుకోవాలి.

రెండో సంవత్సరం
కొంతమంది సులభంగా, మరికొంతమంది కష్టంగా భావించే సబ్జెక్టు మ్యాథ్స్‌ 2 ఏ. 75కు 75 మార్కులు తెచ్చుకోవాలంటే..

* పూర్ణసంఖ్యలకు 8 మార్కుల వెయిటేజీ (4+2+2)  ఞ డిమోయర్‌ సిద్ధాంతం వెయిటేజీ 9 మార్కులు (7+2) ఞ దీని తరువాత  సులభమైన అధ్యాయం యాదృచ్ఛిక చలరాశులు- సంభావ్యత విభజనలు. వెయిటేజీ 9 మార్కులు  (7+2) ఞ దీని తరువాత సులువైన అధ్యాయం సంభావ్యత. దీని నుంచి 15 మార్కులు వస్తాయి (ఒక 7, రెండు 4 మార్కుల ప్రశ్నలు)

* ఆపై ద్విపద సిద్ధాంతం. వెయిటేజీ 16 మార్కులు (రెండు 7, రెండు 4 మార్కుల ప్రశ్నలు) ఞ తరువాత సిద్ధమవ్వాల్సింది- ప్రస్తారాలు- సంయోగాలు. వెయిటేజీ 12 మార్కులు. ప్రస్తారాల నుంచి ఒకటి 4, ఒక 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఞ వర్గ సమాసాలు సులభమైనది. వెయిటేజీ 6 మార్కులు. 4, 2 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పున వస్తాయి.

విద్యార్థులు కష్టంగా భావించే సబ్జెక్టు 2బి. మొదట నిరూపక జ్యామితిలో వృత్తాలు చూసుకోవాలి. తరువాత వృత్త సరణి.  ఈ రెండు అధ్యాయాలూ పూర్తయ్యాక కలన గణితం మొదలుపెట్టాలి. మొదటగా సమాకలనం.  తరువాత నిశ్చిత సమాకలనం. ఆపై అవకలన సమీకరణాలు.  నిరూపక జ్యామితితో పోలిస్తే కలన గణితాన్ని విద్యార్థులు సులభంగా భావిస్తారు. అందుకే వృత్తాలు, వృత్త సరణి తర్వాత కలన గణితం మొదలుపెట్టాలి. కలన గణితంలో మార్కులు సాధించడం సులభం.   పరావలయం. పరావలయం, దీర్ఘవృత్తం, అతిపరావలయం..  ఒకదానికొకటి సంబంధాన్ని కలిగివుంటాయి. కాబట్టి  మొదటగా పరావలయం, తరువాత దీర్ఘవృత్తం, చివరగా పరావలయాన్ని చదవాలి.

మ్యాథ్స్‌ 2బిలో కచ్చితంగా సిద్ధం కావాల్సిన అధ్యాయాలు- వృత్తాలు (22 మార్కులు), వృత్తసరణి (6 మార్కులు), పరావలయం (9 మార్కులు), అతి పరావలయం (6 మార్కులు), సమాకలనం (18 మార్కులు), నిశ్చిత సమాకలనం (15 మార్కులు), అవకలన సమీకరణాలు (13 మార్కులు).
* ఇక వేటిని వదిలేయవచ్చు అంటే.. దీర్ఘవృత్తం (8  మార్కులు), వైశాల్యాలు (4 మార్కులు).

- ఆర్‌. శ్రీనివాసరాజు

(రచయితలు శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో అధ్యాపకులు)
* కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో ముఖ్యమైన ప్రశ్నలను www.eenadupratibhal.nt లో చూడండి.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.