close

తాజా వార్తలు

భద్రత నడుమ తెరుచుకున్న శబరిమల ఆలయం

శబరిమల: అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శబరిమల ఆలయాన్ని మంగళవారం సాయంత్రం తెరిచారు. ఆలయం తెరిచిన సందర్భంగా పూజలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. తాంత్రి కందరారు రాజవీరు ఆధ్వర్యంలో ప్రధాన పూజారి వసుదేవన్‌ గర్భగుడి ద్వారాలను తెరిచారు. నేడు ప్రత్యేక పూజలేమీ లేనందున రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న పూజలు ఫిబ్రవరి 17తో ముగియనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

‘కలభాభిషేకం’, ‘సహస్రకలశం’, ‘లక్షార్చన’ వంటి ప్రత్యేక పూజలను ఈ ఐదు రోజుల్లో నిర్వహించనున్నారు. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయం తెరిచిన సమయంలో ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సన్నిధానం సమీపంలో ప్రస్తుతానికి ఎటువంటి ఆంక్షలు విధించలేదని పోలీసు భద్రతను మాత్రమే పెంచినట్లు అధికారులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.