
తాజా వార్తలు
భార్యాపిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు
కౌలాలంపూర్: పబ్జి ఆన్లైన్ గేమ్ చాలా వేగంగా ప్రాచుర్యం పొంది, అంతేవేగంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఒకసారి ఆ ఆట వ్యసనంగా మారితే వదిలించుకోవడం కష్టంగా మారినట్లు ఎన్నో వార్తా కథనాల ద్వారా వెల్లడవుతోంది. తాజాగా దీనికి సంబంధించి ఓ ఫేస్బుక్ పోస్ట్ వైరల్‌గా మారింది. పబ్జి ఆటకు బానిసగా మారిన ఓ వ్యక్తి నాలుగు నెలల గర్భిణిగా ఉన్న తన భార్యను, బిడ్డను వదిలేశాడు. మలేసియాకు చెందిన వ్యక్తి ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. తన ఆటకు వారి వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వారికి దూరంగా వెళ్లాడు. ఈ విషయాన్ని అతడి భార్య ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ‘అతడు మమ్మల్ని వదిలి నెల రోజులు కావొస్తుంది. మొదట్లో ఈ ఆట ఆడే ముందు బాగానే ఉండేవాడు. కానీ దానికి బానిసగా మారిన దగ్గరి నుంచి రాత్రిళ్లు నిద్రపోవడం కూడా మానేశాడు. పొద్దున్నే లేచేవాడు కాదు. తన పనులు, వ్యాపారాన్ని పట్టించుకోవడం మానేశాడు. దానిపై నేను గట్టిగా మాట్లాడితే భర్తకు ఏ మాత్రం మద్దతు తెలపని భార్యగా నిందించేవాడు’ అని ఆమె ఫేస్బుక్ పోస్ట్‌లో వాపోయింది.
భారత్‌లో కూడా పబ్జి ఆటపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఈ ఆటను నిషేధించాలని గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా ఈ ఆటను నిషేధించారు. తాజాగా పబ్జి ఆట ఆడటానికి స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదని ముంబయికి చెందిన 18 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
- ఇక ఆ హోటల్‌కి అస్సలు వెళ్లను: రకుల్
- వామ్మో..! రోడ్డుపై ఎంత పే..ద్ద యంత్రమో!!
- పుల్వామా దాడి: పక్కా ప్లాన్
- పాక్‌పై దాడి చేయండి: బలూచ్ పోరాట యోధులు
- బాబుతో విభేదాలపై అశోక్ గజపతి రాజు క్లారిటీ
- దాడికి రావల్పిండి ఆస్పత్రి నుంచే మసూద్ ఆదేశాలు
- ప్రపంచకప్:భారత్-పాక్ మ్యాచ్ జరగడానికి వీల్లేదు
- వేర్పాటువాద నేతలకు భద్రత ఉపసంహరణ
- వీర జవాను కుటుంబానికి అర ఎకరా భూమిస్తా
- ‘పెళ్లికి ముందే బిడ్డను కన్నాను’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
