
తాజా వార్తలు
హైదరాబాద్: అప్పటివరకు స్నేహితులతో ఆడుకుంటూ ఉన్న బాలుడు విద్యుత్ స్తంభాన్ని తాకడంతో ఒక్కసారిగా మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు బండ్లగూడ సమీపంలోని పీబీఈఎల్ సిటీ అపార్ట్మెంట్ వద్ద చోటుచేసుకుంది. పీబీఈఎల్ సిటీలో చిన్నారులు ఆడుకునేందుకు పార్కును ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన మోనీష్ (6) తన స్నేహితులతో కలిసి పార్కులో ఆడుకుంటూ విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో కొందరు అక్కడే తిరుగుతున్నా చాలా సేపటి వరకు బాలుడు మృతిచెందిన విషయాన్ని గమనించలేదు. పీఈబీఎల్ సిటీ అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆందోళకు దిగారు. మోనీష్ మృతదేహాన్ని స్వస్థలం చెన్నైకు తరలించారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
- ఇక ఆ హోటల్కి అస్సలు వెళ్లను: రకుల్
- వామ్మో..! రోడ్డుపై ఎంత పే..ద్ద యంత్రమో!!
- పుల్వామా దాడి: పక్కా ప్లాన్
- పాక్పై దాడి చేయండి: బలూచ్ పోరాట యోధులు
- బాబుతో విభేదాలపై అశోక్ గజపతి రాజు క్లారిటీ
- దాడికి రావల్పిండి ఆస్పత్రి నుంచే మసూద్ ఆదేశాలు
- ప్రపంచకప్:భారత్-పాక్ మ్యాచ్ జరగడానికి వీల్లేదు
- వేర్పాటువాద నేతలకు భద్రత ఉపసంహరణ
- వీర జవాను కుటుంబానికి అర ఎకరా భూమిస్తా
- ‘పెళ్లికి ముందే బిడ్డను కన్నాను’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
