close

తాజా వార్తలు

పుట్టినరోజు జరుపుకొందామని పిలిపించి..

ముంబయి: పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామంటూ పిలిచి ఓ యువతిపై ఆమె స్నేహితురాలు అత్యాచారం చేయించిన ఘటన మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లా వాలివ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 13న ముంబయిలోని కండివలికి చెందిన ఓ యువతి(27) పుట్టినరోజున వేడుకలు జరుపుకొందామని నమ్మించి ఆమె స్నేహితురాలు తన ఇంటికి తీసుకెళ్లింది. ముందుగా వేసుకొన్న పథకం ప్రకారం.. తన స్నేహితుడ్ని కూడా అక్కడకు రప్పించింది. ఈ క్రమంలో పుట్టినరోజు జరుపుకొంటున్న యువతి శీతలపానీయంలో ఇద్దరూ కలిసి మత్తుమందు కలిపారు. యువతి సృహ తప్పగానే నిందితురాలి సహాయంతో యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఈ ఘటన ఎవరికీ చెప్పొద్దని బాధిత యువతిని ఇద్దరూ బెదిరించారు. అయినప్పటికీ బాధిత యువతి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పాల్‌ఘర్‌ పోలీసుస్టేషన్‌ అధికారి హేమంత్‌ కట్కర్‌ తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.