close

తాజా వార్తలు

పీఎఫ్‌పై వడ్డీ 8.65శాతం

దిల్లీ: భవిష్యనిధి(పీఎఫ్‌) డిపాజిట్లపై 2018-19 సంవత్సరానికి గానూ వడ్డీరేటును 8.65శాతానికి పెంచుతూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ వెల్లడించారు. గురువారం జరిగిన ఈపీఎఫ్‌వో కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశంలో వడ్డీరేటును పెంచేందుకు సభ్యులు ఆమోదం తెలిపినట్లు గాంగ్వర్‌ తెలిపారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే ఆర్థికమంత్రికి పంపించనున్నట్లు తెలిపారు. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన తర్వాతే చందాదారుల ఖాతాల్లో జమ అవుతుంది.

2017-18 సంవత్సరానికి పీఎఫ్‌ వడ్డీరేటును ఐదేళ్ల కనిష్ఠానికి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 8.55శాతం వడ్డీనే ఇస్తున్నారు. అంతకుముందు 2016-17సంవత్సరానికి 8.65శాతం, 2015-16సంవత్సరానికి 8.8శాతం, 2014-15,2013-14 సంవత్సరాలకు  8.75శాతం, 2012-13 సంవత్సరానికి 8.5శాతం వడ్డీ ఇచ్చారు.

2018-19 సంవత్సరానికి కూడా 8.55శాతాన్నే కొనసాగించే అవకాశాలున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వడ్డీరేట్లను పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.