close

తాజా వార్తలు

ఈ సమయంలో ఎందుకు దీక్ష చేస్తున్నారు?

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌

న్యూదిల్లీ: దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని, తమ డిమాండును నెరవేర్చేవరకు ఈ దీక్షను ఆపేదిలేదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 1 నుంచి ఆయన ఈ దీక్ష చేపట్టనున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌ విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చే విషయంపై పార్లమెంటు సమావేశంలోనే ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు నిర్వహించే అవకాశం లేదు. మరి ఆయన ఈ సమయంలో ఎందుకు దీక్ష చేస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు’ అని విమర్శించారు. కాగా, ఇటీవలే చివరి పార్లమెంటు సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. మళ్లీ లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి.

కాగా, దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా విషయంపై కేజ్రీవాల్ ఆదివారం తన ట్విటర్‌ ఖాతా ద్వారా మరోసారి స్పందించారు. ఆగస్టు 2003లో దిల్లీకి రాష్ట్ర హోదాపై అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి అడ్వాణీ.. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారని, చివరికి అది ఆమోదం పొందలేదని తెలిపారు. ‘దిల్లీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవాలని భావిస్తున్నారా? ఇక్కడి ప్రజలకు ఎందుకు న్యాయం చేయట్లేదు?’ అని ఆయన ప్రశ్నించారు. 2014 ఎన్నికలకు ముందు దిల్లీకి రాష్ట్ర హోదా విషయంలో ప్రజలకు ప్రధాని మోదీ అసత్యాలు చెప్పారని ఆయన విమర్శించారు. ఆయన చెప్పిన అసత్యాల పట్ల దిల్లీ ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారని ఆయన పేర్కొన్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.