close

తాజా వార్తలు

భారత్‌ దాడిని ధ్రువీకరించిన పాక్‌ ఆర్మీ

ఇస్లామాబాద్‌: భారత వైమానిక దళం తమ భూభాగంలోకి వచ్చి దాడులు జరిపినట్లు పాక్‌ సైన్యం ధ్రువీకరించింది. పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఈ దాడులపై స్పందించారు. భారత విమానాలను తిప్పికొట్టినట్లు ఆయన వాదిస్తున్నారు.‘‘ముజఫరాబాద్‌ సెక్టర్‌లోకి భారత వాయుసేన చొచ్చుకువచ్చింది. పాక్‌ వైమానిక దళం ఈ దాడిని తిప్పికొట్టింది. అయితే ఈ దాడిలో ఎటువంటి నష్టం జరగలేదు’’ అని పాక్‌ ఐఎస్‌పీఆర్‌ డీజీ మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. పుల్వామా దాడికి ప్రతీకారంగానే భారత్‌ ఈ దాడులు జరిపినట్లు సమాచారం. దాదాపు 1000కిలోల బాంబులను నియంత్రణ రేఖ వెంట ఉన్న ఉగ్ర స్థావరాలపై జారవిడిచినట్లు సమాచారం.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.