close

తాజా వార్తలు

జైషే సంస్థ మెట్ల మీద..జాతీయ జెండాల చిత్రాలు

నిఘా వర్గాలు విడుదల చేసిన చిత్రాల ద్వారా వెల్లడి

దిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత వైమానిక దళం తగిన రీతిలో బదులిచ్చింది. మంగళవారం తెల్లవారుజామున నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిఘా వర్గాలు కొన్ని చిత్రాలను విడుదల చేశాయి. వాటిలో ఒకదానిలో జైషే మహ్మద్ సంస్థకు చెందిన బాలాకోట్ స్థావరం మెట్ల మీద యూఎస్‌ఏ, యూకే, ఇజ్రాయెల్ దేశాల జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి. ఆ స్థావరాన్ని ఈ రోజు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ధ్వంసం చేసింది. కీలక జైషే ఉగ్రవాదుల లక్ష్యంగా భారత్‌ ఈ దాడికి పూనుకుంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ శిబిరంలో ఉగ్రవాదులకు ఆత్మాహుతి దాడిలో శిక్షణ ఇస్తుంటారు. తాజా దాడిలో వారు హతమైనట్లు భావిస్తున్నారు.

పుల్వామా ఉగ్రదాడికి గట్టి సమాధానం చెప్తూ బాలాకోట్, ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఐఏఎఫ్‌ బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 350మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.






Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.