close

తాజా వార్తలు

షోపియాన్‌లో ఉగ్రదాడి

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మరోసారి దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. షోపియాన్‌ జిల్లాలోని నాగ్బాల్‌లో ఉన్న 44 రాష్ట్రీయ రైఫిల్స్‌ కేంద్రం వద్ద కొందరు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఓ ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడి జరపడానికి ప్రయత్నించారని, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వారి దాడిని తిప్పికొడుతున్నాయని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారం జరుగుతున్నట్లు భద్రతా బలగాల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. కాగా, జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాను సహా ఐదుగురు భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవకముందే మరోసారి భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.