close

తాజా వార్తలు

‘తప్పు’లో కాలేసిన సూరత్‌ వ్యాపారులు

బెంగళూరు, దిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై ఆగ్రహాన్ని, భారత్‌పై తమ దేశభక్తిని చాటుకోవాలనుకున్నారు సూరత్‌ వ్యాపారులు. దాడి జరిగిన 3-4గంటల్లోనే   సైనికదళాల ఫొటోలతో కూడిన వస్త్రాలను సిద్ధం చేయించారు. ఇక్కడే వారు తప్పులో కాలేశారు. ‘చిత్రం’(ఇమేజ్‌) కోసం గూగుల్‌లో ‘ఆర్మీ’ అని టైప్‌ చేయగానే కనిపించిన తొలి ఫొటోను ఎంపిక చేసుకున్నారు. తీరా  అది ప్రింట్‌ అయ్యాక తెలిసిందేమంటే.. ఆ సైనికులు మనవాళ్లు కాదు.. అమెరికా సైనికులని. దీంతో నాలుక్కరుచుకున్న వ్యాపారులు కొత్త ఫొటోలతో వస్త్రాలను సిద్ధం చేశారు. వీటిలో ప్రధాని మోదీ కూడా ఉండటం  గమనార్హం. ఈ ఫొటోలన్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.