close

తాజా వార్తలు

ఐడీబీఐ బ్యాంకు ఎండీగా మరోమారు రాకేష్ శర్మ?

ముంబయి: ఇప్పటివరకు ఐడీబీఐ బ్యాంకునకు మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్న రాకేష్‌ శర్మ మరో మూడేళ్లపాటు బ్యాంకు ఎండీ, సీఈఓగా కొనసాగే సూచనలు అవుపిస్తున్నాయి. అతని పదవీ కాలాన్ని పెంచే విషయాన్ని పరిశీలించేందుకు అంగీకరిస్తున్నట్లు  ఐడీబీఐ బ్యాంకు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా బ్యాంకు బోర్డు విస్తరణకు సంబంధించి ఇద్దరు డిప్యూటీ ఎండీలను కూడా నియమించే పక్రియను ప్రారంభించినట్లు వివరించింది. ఇప్పటికే ఈ బోర్డులో మరో ఇద్దరు డైరెక్టర్లను కూడా నియమించినట్లు వెల్లడించింది. ఇందులో స్కూల్ ఆఫ్‌ బిజినెస్‌ ఫ్రొఫెసర్‌ ఒకరుకాగ.. ఆర్బీఐ రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ మరోకరని బ్యాంకు తెలిపింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.