close

తాజా వార్తలు

రూ. 660.8 కోట్లు సమీకరించిన బీఓఐ

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకైన బీఓఐ(బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) రూ.660.80 కోట్లను సమీకరించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈఎస్‌పీఎస్‌(ఎంప్లాయ్‌ షేర్‌ పర్‌చేజ్ స్కీం) విధానంలో బ్యాంకు ఉద్యోగులకు షేర్లను విక్రయించటం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించామని బీఓబీ వెల్లడించింది. ఒక్క షేరు విలువ రూ.10 కలిగిన 6,25,52,188 షేర్లను అర్హత కలిగిన ఉద్యోగులకు అమ్మినట్లుు బ్యాంకు పేర్కొంది. అయితే ఈ షేర్లను ఒక సంవత్సర కాల లాక్‌ ఇన్‌ పీరియడ్‌లో విక్రయించామని వెల్లడించింది. ఉద్యోగులకు అప్లికబుల్ ప్రైస్‌పై 24.28శాతం డిస్కౌంట్‌ను ప్రకటించినట్లు బ్యాంకు వివరించింది. ఈ ‘ఈఎస్‌పీఎస్‌’ పథకంలో దాదాపుగా మొత్తం ఉద్యోగుల్లో 94.70 శాతం మంది ఉద్యోగులు పాల్గొన్నారని తెలిపింది. బీఓఐ ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దేశంలోని మొదటి అయిదు పెద్ద బ్యాంకుల్లో బీఓఐ ఒకటిగా ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.