close

తాజా వార్తలు

ఆ 43 విమానాల కొనుగోలులో గోల్‌మాల్‌: ఈడీ

న్యూదిల్లీ: తిహార్ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న దీపక్‌ తల్వార్‌ను కొత్త కేసు విషయంలో ప్రశ్నిచండానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ)ని దిల్లీ కోర్టు అనుమతించింది. ఫ్రాన్స్‌కి చెందిన ఎయిర్‌బస్‌ నుంచి ఎయిర్‌ ఇండియా 2005లో 43 విమానాలను కొనుగోలు చేసింది. ఆ సమయంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడ్డారని, అందువల్ల సంస్థకు భారీగా నష్టం వాటిల్లిందని ఈడీ ఆరోపించింది. వేరే కేసు విషయంలో ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న తల్వార్‌ను ప్రశ్నించేందుకు అనుమతివ్వాలంటూ ఈడీ గురువారం దిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తల్వార్‌ని ప్రశ్నిస్తేనే ఈ కేసుకు సంబంధించి అసలు నిజాలు బయటపడతాయని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు డీ.పీ. సింగ్, నితీశ్‌ రానా కోర్టుకు తెలియజేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈడీకి అనుమతులు మంజూరు చేసింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.