close

తాజా వార్తలు

రైళ్ల రాకపోకల వేళలన్నీ ఆయనకు కంఠస్తమే!

గుజరాత్‌: తన అద్భుత జ్ఞాపకశక్తితో అతను దృష్టి లోపాన్ని అధిగమిస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు. సూరత్‌లో రైల్వే ప్రకటనలు చేసే విధులు నిర్వర్తిస్తున్న ఈ వీరేంద్రను చూసిన వారంతా అతన్ని అభినందించకుండా ఉండలేరు. రైళ్ల రాకపోకల వేళలను చక్కగా గుర్తుపెట్టకుని అతను చకచకా ప్రకటనలు చేస్తుంటారు. ఎక్కడా పొరపాటు, తడబాటు లేకుండా ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఏ రైలు ఎప్పుడొస్తుందో సమయానుసారంగా చెప్పేస్తుంటారు. విధుల్లో చేరినప్పటి నుంచి ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా తప్పుడు ప్రకటన చేయలేదు. 2002లో వీరేంద్ర విధుల్లో చేరారు. పుట్టుకతో చూపు బాగానే ఉన్నా 26-27 ఏళ్ల వయసు నుంచి అతనికి దృష్టి మందగిస్తూ వచ్చింది. విధుల్లో చేరిన కొత్తలో 5 శాతం వరకు చూపు ఉండేది. అనంతరం దృష్టి లోపం పెరిగింది. ఎప్పటికప్పుడు రైల్వే టైం టేబుల్‌ మారుతున్నా తదనుగుణంగా అన్నీ గుర్తు పెట్టుకుని అతను ప్రకటనలు చేస్తుండటం విశేషం.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.