close

తాజా వార్తలు

కేవలం 28 మంది మహిళలు మాత్రమే..

 లోక్‌సభ ఎన్నికల ప్రత్యేకం

ఇంటర్నెట్‌డెస్క్‌: మహిళలు అన్ని రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చుతున్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం కాస్త వెనకబడే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల నుంచి అతి తక్కువ మంది మహిళలు విజయం సాధిస్తున్నారు. అటువంటి రాష్ట్రాల్లో రాజస్థాన్‌ ఒకటి. ఆ రాష్ట్రంలో ఉన్న ఓటర్లలో సగం మంది మహిళలే అయినప్పటికీ 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలన్నింటిలో కలిపి ఆ రాష్ట్రం నుంచి కేవలం 28 మంది మహిళలు మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు.

* 1952, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో మహిళలు పోటీ చేసినప్పటికీ, 1962 ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఆ రాష్ట్రం నుంచి ఓ మహిళ గెలుపొందారు.

* రాజ కుటుంబానికి చెందిన గాయత్రీ దేవి.. స్వతంత్ర పార్టీ తరఫున పోటీ చేసి జయపుర నియోజక వర్గం నుంచి 1962 ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన 1967, 1971 ఎన్నికల్లోనూ గెలుపొందారు.

* గాయత్రీ దేవి తర్వాత ఆ రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన రెండో మహిళగా జోధ్‌పూర్‌ రాజవంశానికి చెందిన కృష్ణ కుమారి నిలిచారు. 1971 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆమె గెలిచారు.

* 1980లో చిత్తౌడగఢ్ నుంచి‌ నిర్మల కుమారి షెఖావత్‌, 1984లో ఉదయ్‌పూర్‌ నుంచి రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి మోహన్‌లాల్‌ సుఖాడియా భార్య ఇందుబాలా సుఖాడియా గెలిచారు. 

* ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె.. భాజపా తరఫున ఝాలావాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి 1989న మొదటి సారి పోటీ చేసి గెలిచారు. ఆమె వరసగా అదే నియోజక వర్గం నుంచి ఐదుసార్లు గెలిచారు.

* 1991 ఎన్నికల్లో ఆ రాష్ట్రం నుంచి రాజవంశాలకు చెందిన ముగ్గురు మహిళలు (మహేంద్ర కుమారి, కృష్ణేంద్ర కౌర్‌, వసుంధర రాజె) లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గిరిజవ్యాస్‌ (ఉదయ్‌పూర్‌నుంచి) ఎన్నికయ్యారు.

* 2014లో భారతీయ జనతా పార్టీ నాయకురాలు సంతోష్‌ అహ్లావత్‌.. ఝుంఝునూ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.