
తాజా వార్తలు
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఆర్. కనకరాజ్ గురువారం మృతిచెందారు. సూలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కనకరాజ్(67) ఈ ఉదయం తన ఇంట్లో పేపర్ చదువుతుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కనకరాజ్ మృతి పట్ల అన్నాడీఎంకే పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కనకరాజ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సూలురు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు.
కాగా.. 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు మృతిచెందారు. అంతకుముందు ఎమ్మెల్యేలు సీనివెల్, ఏకే బోస్, ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కన్నుమూశారు. మరోవైపు కనకరాజ్ మృతితో తమిళనాడు అసెంబ్లీలో ఖాళీల సంఖ్య 22కు పెరిగింది. అంతకుముందు అన్నాడీఎంకేకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా కనకరాజ్ మరణంతో 22 స్థానాలకు ఉప ఎన్నికల అనివార్యమైంది. అయితే వీటిలో 18 స్థానాలకు ఏప్రిల్ 18న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
