close

తాజా వార్తలు

నో టీ స్‌ బో ర్డు

 

ప్రభుత్వ ఉద్యోగాలు
సాయుధ బలగాల్లో 496 మెడికల్‌ ఆఫీసర్లు

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో(ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు.
పోస్టు-ఖాళీలు: సూపర్‌ స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్‌(సెకండ్‌ ఇన్‌ కమాండ్‌)- 04, స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (డిప్యూటీ కమాండెంట్‌)- 175, మెడికల్‌ ఆఫీసర్‌(అసిస్టెంట్‌ కమాండెంట్‌)- 317.
మొత్తం ఖాళీలు: 496.
అర్హత: ఎంబీబీఎస్‌, డీఎం, ఎంసీహెచ్‌, పీజీ డిగ్రీ, డిప్లొమా తదితరాల్లో ఉత్తీర్ణతతోపాటు, పని అనుభవం, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక: విద్యార్హత మార్కులు, పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ తేదీలు: ఏప్రిల్‌ 2 నుంచి మే 1 వరకు.
వెబ్‌సైట్‌: http://recruitment.itbpolice.nic.in/

 

అర్హత పరీక్ష
తెలంగాణ సెట్‌ 2019

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ లెక్చరర్‌ బోధనార్హతకు నిర్వహించే తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టీఎస్‌ సెట్‌-2019) సంక్షిప్త ప్రకటన విడుదలైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది. అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొదటి పేపర్‌లో 50 ప్రశ్నలకు 100 మార్కులు.. రెండో పేపరులో 100 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. పరీక్ష కాలవ్యవధి 3 గంటలు.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహణ తేది: జులై 5, 6.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: మార్చి 27.
వెబ్‌సైట్‌:‌www.telanganaset.org

 

ప్రవేశాలు
ఎంఎస్‌ఐటీ ప్రోగ్రాం-2019

హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ ఐటీ- మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎంఎస్‌ఐటీ) ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ప్రోగ్రాం: మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోర్సును అందించే సంస్థలు: ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ- హైదరాబాద్‌), జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూ)- హైదరాబాద్‌/ కాకినాడ/ అనంతపురం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ.
విభాగాలు: మెషిన్‌ లర్నింగ్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, ఈ-బిజినెస్‌ టెక్నాజీస్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సాప్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, డేటా అనలిటిక్స్‌ అండ్‌ డేటా విజువలైజేషన్‌, మొబైల్‌ టెక్నాలజీస్‌.
అర్హత: బీఈ/ బీటెక్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
సీట్లు: ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌- 110, జేఎన్‌టీయూ హైదరాబాద్‌- 100, జేఎన్‌టీయూ కాకినాడ- 50, జేఎన్‌టీయూ అనంతపురం- 50, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ- 50.
మొత్తం సీట్ల సంఖ్య: 360
ఎంపిక: ప్రవేశపరీక్షలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మే 13
ప్రవేశ పరీక్ష తేది: మే 26
వాక్‌ఇన్‌ ప్రవేశపరీక్షల నిర్వహణ: మార్చి 14 నుంచి మే 18 వరకు.
మెయిన్‌ ప్రోగ్రాం ప్రారంభం: జులై 13.
వెబ్‌సైట్‌: http://msitprogram.net/msit2019/

 

నైపర్‌ జేఈఈ 2019

ఫార్మసీ విద్యలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి వీలు కల్పించే నైపర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌- నైపర్‌ జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ వెలువడింది.
నైపర్‌ క్యాంపస్‌లు: అహ్మదాబాద్‌, గువహటి, హాజీపూర్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌ఏఎస్‌ నగర్‌.
కోర్సులు: ఎంఫార్మసీ, ఎంఎస్‌ (ఫార్మా), ఎంటెక్‌ (ఫార్మా), ఎంబీఏ (ఫార్మా), పీహెచ్‌డీ.
విభాగాలు: బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజెస్‌, మెడిసినల్‌ కెమిస్ట్రీ, నేచురల్‌ ప్రొడక్ట్స్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ తదితరాలు.
అర్హత: బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్‌, బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, జీప్యాట్‌ తదితరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: ప్రవేశపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తేదీలు: ఏప్రిల్‌ 1 నుంచి మే 15 వరకు.
కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశ పరీక్ష తేది: జూన్‌ 9.
www.niperahm.ac.in

 

డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ కోర్సులు

పుణెలోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ 2019-20 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* ఎంటెక్‌
* ఎంఎస్సీ ఫుడ్‌ టెక్నాలజీ(స్పాన్సర్డ్‌ కేటగిరీ)
* మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌(రిసెర్చ్‌) ప్రోగ్రాం,
అర్హత: బ్యాచిలర్‌/ మాస్టర్‌ డిగ్రీ, గేట్‌ ఉత్తీర్ణత.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 23.04.2019.
హార్డుకాపీలు పంపించేందుకు చివరితేది: 30.04.2019.
వెబ్‌సైట్‌: www.diat.ac.in

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.