
తాజా వార్తలు
చెడిపోయిన రక్తం ఎక్కించడంతో 15 మంది గర్భిణీలు మృతి
చెన్నై: ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు రక్తం ఎక్కించి ప్రాణాలు కాపాడుతుంటారు. కానీ ఆ రక్తమే ప్రాణాలు తీసే విషంలా మారితే.. అలాంటి ఘటనే జరిగింది తమిళనాడులో. చెడిపోయిన రక్తం ఎక్కించడంతో నాలుగు నెలల్లో 15 మంది గర్భిణిలు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది చివర్లో చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని ధర్మపురి, హోసూర్, కృష్ణగిరి ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు 15 మంది గర్భిణిలు మృతిచెందారు. వరుసగా మహిళలు ప్రాణాలు కోల్పోతుండటంతో అధికారులు, సీనియర్ వైద్యులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి మరణానికి చెడిపోయిన రక్తం కారణమని తెలిసింది.
రక్తనిధి కేంద్రాల్లో సరైన వాతావరణంలో రక్తాన్ని నిల్వ చేయలేకపోతే ఆ రక్తం చెడిపోతుంది. ఎర్ర రక్తకణాలు ఎక్కడికక్కడే విచ్ఛిన్నమవుతాయి. ఆసుపత్రిల్లో అలాంటి చెడిపోయిన రక్తం ఎక్కించడం వల్లే వీరు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ‘చెడిపోయిన రక్తం ఎక్కించడంతో మహిళలకు సైడ్ఎఫెక్ట్స్ వచ్చాయి. రక్తం ఎక్కించిన కాసేపటికే కొందరికి ఫిట్స్ వచ్చింది. జనవరి వరకు మొత్తం 15 మంది మృతిచెందారు. దీంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు సదరు రక్తనిధి కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లపై చర్యలు తీసుకుంటున్నాం. వారిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నాం’ అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
‘సాధారణంగా మంచి రక్తాన్ని, చెడు రక్తాన్ని చూడగానే గుర్తుపట్టొచ్చు. రక్తనిధి కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది గానీ, ల్యాబ్ టెక్నీషియన్లు గానీ దీన్ని గుర్తించలేదంటే వారి నిర్లక్ష్యం అర్థమవుతోంది. అంతేగాక, డాక్టర్లు కూడా ఈ రక్తాన్ని మంచిదని ధ్రువీకరించడం గమనార్హం’ అని ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి తెలిపారు.
ఆ మధ్య తమిళనాడులోని ఓ ప్రభుత్వాస్పత్రిలో ఇలాగే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీకి హెచ్ఐవీ సోకిన రక్తం ఎక్కించిన విషయం తెలిసిందే. రక్తదానం చేసిన వ్యక్తికి హెచ్ఐవీ ఉంది. అయితే హెచ్ఐవీ పరీక్ష చేయకుండానే ఆ రక్తాన్ని ఆసుపత్రికి పంపారు. దాన్ని ఎనిమిది నెలల గర్భిణీకి ఎక్కించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు రక్తదాత పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
