close

తాజా వార్తలు

రాజస్థాన్‌లో కూలిన మిగ్‌ 27

జోధ్‌పూర్‌ : మిగ్‌ 27 యుద్ధ విమానం ఒకటి ఆదివారం ఉదయం రాజస్థాన్‌లో కూలిపోయింది. మిగ్‌-27 యూపీజీ విమానం  జోధ్‌పూర్‌ నుంచి బయలుదేరిన కాసేపటికే కూలినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడికి 180 కిమీ దూరంలోని సిరోహి ప్రాంతంలో ఇది కూలినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి  అధికారులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవల మిగ్‌ విమానాలు కూలిపోయిన ఘటనలు ఎక్కువవుతున్నాయి.  భారత వాయుసేనకు చెందిన మిగ్‌21 యుద్ధ విమానం ఈ నెల మొదట్లో బికనేర్‌ జిల్లాలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడి అనంతరం భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాక్‌ విమానాలను తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ నడిపిన  మిగ్‌21ను కూడా భారత్‌ కోల్పోయింది. 

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.