close

తాజా వార్తలు

ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు లష్కరే తోయిబా ఉగ్ర‌వాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే ప‌క్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ సాయుధ పోలీసులు నిర్భంద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన సిబ్బంది నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సంఘటనా స్థలిలో రెండు ఏకే రైఫిల్స్‌, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, ఒక తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.