close

తాజా వార్తలు

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు ఉగ్రవాదుల హతం

షోపియన్‌: నేడు జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు కాల్చివేశాయి. షోపియన్‌ జిల్లాలోని ఇమామ్‌ సాహిబ్‌ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకొంది. ఆ ప్రాంతం మొత్తాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నాయి. తొలుత శనివారం ఉదయం ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో అక్కడ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించడంతో సైన్యం వాటిని తిప్పికొట్టింది.  ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. 
నేడు ఉదయం 10.30 సమయంలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌ ప్రయాణిస్తుండగా సమీపంలోని ఒక కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌లోని ఒక వాహనం స్వల్పంగా దెబ్బతింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.