close

తాజా వార్తలు

సెలవులో ఉన్న జవాన్‌పై ఉగ్రవాదుల కాల్పులు

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. సెలవులో ఉన్న ఓ జవాన్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. కశ్మీర్‌ ప్రాంతంలోని  సైనికుడి స్వగ్రామమైన వార్‌పొరలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్‌ రఫీ అనే జవాన్‌ ఉత్తర కశ్మీర్‌లోని 52 రాష్ట్రీయ రైఫిల్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చారు. శనివారం సాయంత్రం ఓ ఉగ్రవాది రఫీ ఇంటి వద్దకు చేరకుని ఆయనపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే జవాన్‌ను ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.  రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. గత జూన్‌ నుంచి సెలవులపై ఉన్న జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు హత్యలకు పాల్పడుతున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.