Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 84133
            [news_title_telugu_html] => 

జగిత్యాల: నడిరోడ్డుపై గొడ్డలితో దాడి..

[news_title_telugu] => జగిత్యాల: నడిరోడ్డుపై గొడ్డలితో దాడి.. [news_title_english] => Attack with the axe In Jagityal [news_short_description] => జగిత్యాల జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణానికి చెందిన తిప్పర్తి కిషన్‌, అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ మధ్య... [news_tags_keywords] => Crime,Attack,Jagityal [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/uX5Hp8AaNxQ [news_videoinfo] => |https://www.youtube.com/embed/uX5Hp8AaNxQ [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-16 00:07:35 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జగిత్యాల: నడిరోడ్డుపై గొడ్డలితో దాడి.. - Attack with the axe In Jagityal - EENADU
close

తాజా వార్తలు

జగిత్యాల: నడిరోడ్డుపై గొడ్డలితో దాడి..

జగిత్యాల గ్రామీణం: జగిత్యాల జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణానికి చెందిన తిప్పర్తి కిషన్‌, అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ మధ్య భూవివాదం విషయంలో తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం జగిత్యాల టవర్‌ సర్కిల్‌ సమీపంలోని సార్గమ్మ వీధిలో ఉంటున్న కిషన్‌ వద్దకు చేరుకున్న లక్ష్మణ్‌.. ద్విచక్ర వాహనంలో ఉంచిన గొడ్డలిని బయటకుతీసి విచక్షణారహితంగా దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కిషన్‌ను తీవ్రంగా గాయపరిచిన లక్ష్మణ్‌ ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం స్థానికులు బాధితుడిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కిషన్‌పై లక్ష్మణ్‌ దాడి చేసిన దృశ్యాలు సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.