
తాజా వార్తలు
జగిత్యాల గ్రామీణం: జగిత్యాల జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణానికి చెందిన తిప్పర్తి కిషన్, అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ మధ్య భూవివాదం విషయంలో తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం జగిత్యాల టవర్ సర్కిల్ సమీపంలోని సార్గమ్మ వీధిలో ఉంటున్న కిషన్ వద్దకు చేరుకున్న లక్ష్మణ్.. ద్విచక్ర వాహనంలో ఉంచిన గొడ్డలిని బయటకుతీసి విచక్షణారహితంగా దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కిషన్‌ను తీవ్రంగా గాయపరిచిన లక్ష్మణ్ ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం స్థానికులు బాధితుడిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కిషన్‌పై లక్ష్మణ్ దాడి చేసిన దృశ్యాలు సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
