close

తాజా వార్తలు

సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్ నిలయం ఏడో అంతస్తులో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షార్ట్ సర్కూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనలో పలు దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఉదయం 6 గంటల సమయంలో పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో కంప్యూటర్, టెలికమ్యూనికేషన్‌కు సంబంధించిన డ్రాయింగ్స్ కలిపోయినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. సకాలంలో రావడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.