close

తాజా వార్తలు

పెంపుడు కుక్క తెచ్చిన వివాదం: వీడియో వైరల్‌

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా విద్యానగర్‌లో ఓ పెంపుడు కుక్క రెండు కుటుంబాల మధ్య దాడులు చేసుకునే పరిస్థితికి కారణమైంది. సందీప్‌ అనే వ్యక్తికి చెందిన శునకం పక్కనే ఉన్న టిఫిన్‌ సెంటర్‌ వద్ద బహిర్భూమికి వెళ్లేది. దీంతో చిరాకు చెందిన హోటల్‌ యజమాని సందీప్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయంలో మాటామాటా పెరగడంతో రెండు కుటుంబాలు దాడులు చేసుకొనే స్థాయికి వెళ్లారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆవేశానికి గురైన కుక్క యజమాని సందీప్‌ ఓ మహిళపై దాడిచేశాడు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 
 

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.