close

తాజా వార్తలు

నైజ‌ర్‌లో అగ్ని ప్రమాదం: 55 మంది మృతి

నియామె: పశ్చిమ ఆఫ్రికా దేశం నైజ‌ర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలడంతో 55 మంది ప్రజలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై నైజర్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ప్రకటన చేశారు. ‘ఈ ప్రమాదంలో 55 మంది మృతి చెందగా మరో 36 మందికి తీవ్రగాయాలయ్యాయి’ అని మీడియాకు తెలిపారు. మంటల్లో కాలిపోవడం వల్లే వారు మృతి చెందారని వివరించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

‘రైల్వే ట్రాక్‌ మీదుగా ఆ పెట్రోల్‌ ట్యాంకర్‌ వెళుతుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో అందులోని పెట్రోల్‌ను డబ్బాల్లో నింపుకెళ్లేందుకు స్థానికులు ప్రయత్నించారు. అదే సమయంలో ఆ ట్యాంకర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆ ట్యాంకర్‌ చుట్టూ ఉన్న వాళ్లంతా కాలిపోయారు’ అని స్థానిక వ్యక్తి ఒకరు మీడియాకు వివరించారు. నైజర్‌ రాజధాని నియామెలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు.   


 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.