close

తాజా వార్తలు

ఆస్పత్రిలో అంబులెన్స్‌కు మంటలు!

సూర్యాపేట క్రైం: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి ఓ అంబులెన్స్‌ దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొద్దిరోజులుగా అంబులెన్స్‌ మరమ్మతులకు గురికావడంతో ఆసుపత్రి వెనక చెత్త వేసే ప్రాంతంలో దీన్ని నిలిపి ఉంచారు. బుధవారం సాయంత్రం ఆసుపత్రి సిబ్బంది చెత్తకు నిప్పు పెట్టి వెళ్లిపోయారు. ఈ క్రమంలో మంటలు ఎగసి అంబులెన్స్‌కు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.