Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 96905
            [news_title_telugu_html] => 

హమ్మయ్య ఏశాట్‌ శకలాల ప్రమాదం తప్పినట్లే

[news_title_telugu] => హమ్మయ్య ఏశాట్‌ శకలాల ప్రమాదం తప్పినట్లే [news_title_english] => most of the asat debris has been decayed satish reddy [news_short_description] => భారత్‌ ఇటీవల చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక ప్రయోగంలో వెలువడ్డ శకలాలు దాదాపు అంతరిక్షం నుంచి తొలగిపోయాయని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారు, డీఆర్డీవో... [news_tags_keywords] => asat,drdo,satish reddy [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-11 13:30:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హమ్మయ్య ఏశాట్‌ శకలాల ప్రమాదం తప్పినట్లే - most of the asat debris has been decayed satish reddy - EENADU
close

తాజా వార్తలు

హమ్మయ్య ఏశాట్‌ శకలాల ప్రమాదం తప్పినట్లే

దిల్లీ: భారత్‌ ఇటీవల చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక ప్రయోగం(ఏశాట్‌)లో వెలువడ్డ శకలాలు దాదాపు అంతరిక్షం నుంచి తొలగిపోయాయని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారు, డీఆర్డీవో ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి తెలిపారు. మిగిలిన మరికొన్ని వ్యర్థాలు కూడా అతి త్వరలోనే నిర్వీర్యమైపోతాయని స్పష్టం చేశారు. దిల్లీలో శుక్రవారం ‘జాతీయ భద్రతలో సాంకేతికత’ పేరిట జరిగిన ఓ సదస్సులో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.‘‘ కొన్ని వారాల్లో ఏశాట్‌ ద్వారా ఏర్పడిన శకలాలు తొలగిపోతాయని గతంలోనే చెప్పాను. ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ప్రకారం చాలా వరకు వ్యర్థాలు అంతరిక్షం నుంచి తొలగిపోయాయి. ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే అవి కూడా అతి త్వరలో నిర్వీర్యమైపోతాయి’’ అని సతీష్‌ రెడ్డి తెలిపారు. వ్యర్థాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని విశ్లేషించామన్నారు. ఈ విషయంలో ఇక ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

ఏప్రిల్‌ 6న డీఆర్డీవో భవన్‌లో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఏశాట్‌ ప్రయోగానికి అత్యంత దిగువ కక్ష్యను ఎంచుకున్నామని తెలిపారు. దీని వల్ల ప్రయోగంలో వెలువడ్డ శకలాలన్నీ క్రమంగా భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయన్నారు. ‘మిషన్‌ శక్తి’ పేరిట చేపట్టిన ఈ ప్రయోగం కేవలం భారత సామర్థ్య పెంపులో భాగమేనన్నారు. దీని ద్వారా అంతరిక్షంలోని ఆస్తులకు ఎలాంటి ముప్పు ఉండదని తెలిపారు. మార్చి 27న భారత్‌ ఏశాట్‌ ప్రయోగం నిర్వహించిన విషయం తెలిసిందే. దీని ద్వారా భూమికి 300 కి.మీ ఎగువన ఉన్న కక్ష్యలోని ఓ ఉపగ్రహాన్ని క్షిపణితో ధ్వంసం చేశారు. అయితే ఈ ప్రయోగంలో వెలువడిన శకలాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముప్పు పొంచి ఉందని అప్పట్లో నాసా ఆందోళన వ్యక్తం చేసింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.