close

తాజా వార్తలు

బ్యాంకింగ్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా

యువతకు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో ఉద్యోగం సంపాదించాలనే కోరిక, ఉత్సుకత అధికంగా ఉంటుంది. కచ్చితమైన ప్రణాళిక, అవగాహన ఉండి సరైన కోర్సులను ఎంచుకుంటే వాటిల్లోని అనేక విభాగాల్లో ఉన్నతమైన భవిష్యత్తును అందుకోవచ్చు.

భారత బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలు తమ వినియోగదారులకు సమర్థ, ప్రభావపూరితమైన సేవలను అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. వ్యయాన్ని తగ్గించి, లాభదాయకతను పెంపొందించేందుకు కృషిచేస్తున్నాయి. వినియోగదారుల సమాచార భద్రత, వేగవంతమైన సేవలకు నిరంతరం అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. రోజురోజుకూ మారుతున్న సాంకేతికత వల్ల కొత్త విధానాలను అవలంబించాల్సి వస్తోంది. అందుకు తగిన నిపుణుల అవసరం పెరుగుతోంది. అలాంటి నిఫుణులను తయారుచేసేందుకు, సాంకేతికతను మెరుగుపరిచేందుకు భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) ప్రత్యేకంగా హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) సంస్థను నెలకొల్పింది. ఇది  2019-20 సంవత్సరానికి బ్యాంకింగ్‌ టెక్నాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌లో (పీజీబీఈటీ) ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సును ఈ సంస్థ మాత్రమే అందిస్తుంది.

ప్రస్తుతం భారత్‌ ప్రపంచ దేశాల్లోనే వేగంగా, స్థిరమైన అభివృద్ధి సాధిస్తున్నదేశం. ఆర్థిక, సేవల రంగంలోనే అనేక విప్లవాత్మమైన మార్పులు  ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. వివిధ రూపాల్లో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సేవలు వినియోగదారులకు చేరువవుతున్నాయి. ప్రత్యేక బ్యాంకులు, మొబైల్‌, నెట్‌ బ్యాంకింగ్‌ లాంటి కొత్త పద్ధతుల్లో విస్తృతంగా సేవలను అందిస్తున్నాయి. ఈ కోర్సులో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌లో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, అనుసంధానం, మేనేజ్‌మెంట్‌ విషయాలను నేర్పుతారు. ప్రస్తుత సాంకేతికతతోపాటు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీల వినియోగంతో బ్యాంకుల వృద్ధికి దోహదపడే అంశాలపై అవగాహన కల్పిస్తారు.
పీజీడీబీటీ ముఖ్య ఉద్దేశం భారత బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగంలో నైపుణ్యం ఉన్న సాంకేతిక నిపుణులను తయారుచేయడం. ఈ కోర్సులో శిక్షణ పొందిన వారిని బ్యాంకులు, ఫైనాన్స్‌ రంగాలతో పాటు వీటి అనుబంధ విభాగాల్లోకి తీసుకుంటారు.

ఉద్యోగ అవకాశాలు 

కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు భారత ప్రభుత్వ రిజర్వ్‌ బ్యాంక్‌, ప్రైవేట్‌ బ్యాంకులైన సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా, ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ఉద్యోగాలు ఇస్తున్నాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆర్థిక సేవల రంగంలోని సంస్థలు, వీటికి అనుబంధంగా పనిచేసే ఐటీ కంపెనీల్లో ఏడాదికి రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వార్షికాదాయంతో ఉద్యోగాలు లభిస్తున్నాయి.

అర్హతలు
ఇంజినీరింగ్‌లో మొదటి తరగతి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత లేదా మొదటి తరగతి మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటుగా జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలైన క్యాట్‌/ మ్యాట్‌/  సీమ్యాట్‌/  జీమ్యాట్‌/ ఎక్స్‌ఏటీ/ ఏటీఎంఏ/ జీఆర్‌ఈ లాంటి వాటిలో అర్హత సాధించి ఉండాలి. అనంతరం అభ్యర్థులు గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటంన్నింటిలో ప్రతిభ, మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.  అయితే ఏదైనా బ్యాంక్‌ లేదా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లు సిఫారసు చేసిన వారికి ఎటువంటి జాతీయ పరీక్షల అర్హత అవసరం లేదు. పై విద్యార్హతలతో గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ఏడాది వ్యవధిగల ఈ కోర్సులో మొత్తం 40 సీట్లకు ప్రవేశాలను కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ప్రవేశ రుసుం రూ.2000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 22.05.2019
వెబ్‌సైట్‌:
http://idrbt.ac.in/


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.