close

తాజా వార్తలు

శ్రీలంక అల్లర్లలో ఒకరి మృతి

కొలంబో: శ్రీలంకలో చెలరేగిన ముస్లిం వ్యతిరేక ఘర్షణలు చివరకు ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాయి. అల్లర్లు రోజురోజుకీ తీవ్ర రూపం దాలుస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటుండడం గమనార్హం. ఆదివారం సాయంత్రం పుట్టలం జిల్లాలో చెలరేగిన అల్లర్లు.. సోమవారం సాయంత్రానికి కొలంబో సరిహద్దులోని మరో మూడు జిల్లాలకు వ్యాపించాయి. ఆదివారం పలు ముస్లిం వ్యాపారుల దుకాణాలే లక్ష్యంగా ప్రారంభమైన దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ‘‘కొంత మంది మూకలు పదునైన ఆయుధాలతో ఆయన కార్‌పెంట్రీ వర్క్‌షాప్‌లోనే దాడి చేయడంతో ఆయన మరణించారు. ప్రస్తుతం చెలరేగుతున్న అల్లర్ల ధాటికి మరణించిన తొలి వ్యక్తి ఇతనే’’ అని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై స్పందించిన ఆ దేశ ప్రధాని రణిల్‌ విక్రమసింఘే.. దేశంలో అస్థిరతను సృష్టించడం కోసం కొన్ని అసాంఘిక శక్తులు కుట్ర పన్నుతున్నాయన్నారు. అందులో భాగంగానే ఈ గొడవలు జరుగుతున్నాయన్నారు. వీటిని అదుపులోకి తీసుకురావడానికి కర్య్ఫూ విధిస్తున్నామన్నారు. పోలీసు, భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా.. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా మూకలు సాగుతున్నాయని తెలిపారు. 

ఈ అల్లర్లతో ఏప్రిల్‌ 21నాటి వరుస బాంబు పేలుళ్లపై విచారణకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ప్రధాని తెలిపారు. అల్లరి మూకలను అదుపు చేసే క్రమంలో భద్రతాబలగాలకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు ఆ దేశ పోలీస్‌ ఛీఫ్‌ చందన విక్రమరత్నే ప్రకటించారు. నార్త్‌ వెస్ట్రన్‌ ప్రావిన్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉండడంతో ప్రజలు నివాస సముదాయాలను వదిలి బయటికి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. రంజాన్‌ పవిత్ర మాసం కొనసాగుతుండడంతో పోలీసుల మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతుండడం.. ప్రజల మధ్య విద్వేషాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. దీంతో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌పై తాత్కాలిక నిషేధం విధించారు. బాంబు పేలుళ్ల అనంతరం నెలకొన్న భయానక వాతావరణం నేపథ్యంలో అనేక రోజుల పాటు మూతపడ్డ పాఠశాలలు సోమవారం తెరచుకొన్నాయి. కానీ హాజరు శాతం మాత్రం పెద్దగా నమోదు కావడం లేదని అక్కడి అధికారులు తెలిపారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.