close

తాజా వార్తలు

కారు బోల్తా.. 9మందికి గాయాలు

చౌటుప్పల్‌ గ్రామీణం: సూర్యాపేట జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని ధర్మోజీగూడెం వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పెద్దమోదుగుపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌లోని వారి బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరయ్యారు. బుధవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గంమధ్యంలో సూర్యాపేట జిల్లా ధర్మోజీగూడెం వద్దకు రాగానే మతిస్థిమితంలేని ఓ మహిళ కారుకు అడ్డుగా వచ్చింది. ఆమెను తప్పించే ప్రయత్నంలో‌ అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అవతలివైపు దూసుకెళ్లి బోల్తాపడింది. అదే సమయంలో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా రోడ్డుపై పడిన కారును వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.