
తాజా వార్తలు
చెన్నై: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్‌ను చేదు అనుభవం ఎదురైంది. కమల్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా కొందరు ఆయనపైకి చెప్పులు విసిరారు. అయితే ఆవి ఆయనకు తగల్లేదు. హిందూ ఉగ్రవాదం అంటూ ఇటీవల కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
కమల్ హాసన్ బుధవారం మదురై అసెంబ్లీ నియోజకర్గపరిధిలోని తిరుప్పరాన్‌కుంద్రమ్‌లో ఎన్నికల ర్యాలీ చేపట్టారు. వాహనంపై నిల్చుని కమల్ ప్రసంగిస్తుండగా కొందరు వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరారు. అయితే అవి కమల్ వాహనానికి తగిలి కిందపడ్డాయి. ఈ ఘటనపై కమల్ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 11 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిలో భాజపా నేతలు, హనుమాన్ సేన సభ్యులు కూడా ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
‘స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది ఓ హిందువు. ఆయన పేరు నాథూరామ్ గాడ్సే’ అంటూ కమల్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. కమల్‌పై కేసు కూడా నమోదైంది. దీంతో ఆయన మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
ఎక్కువ మంది చదివినవి (Most Read)
