close

తాజా వార్తలు

3,000 ఆధార్‌ కార్డులను పడేసి వెళ్లారు!

చెన్నై: దాదాపు 3,000 ఆధార్‌ కార్డులను కొందరు ఓ నది వద్ద పడేసి వెళ్లిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరుప్పూరు జిల్లా తిరుతురైపూండీలోని ముళ్లియారు నది వద్ద కుప్పలుగా పడేసి ఉన్న ఆధార్‌ కార్డులు కనపడ్డాయి. ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న చిన్నారులకు కొన్ని సంచులు కనపడగా వారు వాటిని తెరచి చూశారు. వాటన్నింటిలో ఆధార్‌ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని, ఆధార్‌ కార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఆ కార్డులన్నీ ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న కట్టిమెడు, వడపతి, ఆతిరంగం గ్రామాలకు చెందిన ప్రజలవని తెలుస్తోంది.

గ్రామస్థులు ఈ విషయంపై పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఆ ఆధార్‌ కార్డులన్నీ పాడైపోయి ఉన్నాయని, అవి ఎవరివి? చిరునామాలు ఏంటి? అన్న విషయాలు గురించి తెలుసుకోవడానికి వీల్లేకుండా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఆధార్‌ కార్డుల్లో ఉన్న సమచారం తీసుకుని ఎవరైనా అవకతవకలకు పాల్పడే ప్రయత్నాలు చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.