close

తాజా వార్తలు

పురుగుమందు తాగి.. ఉరేసుకున్న ప్రేమజంట 

చదువుకున్న బడిలోనే ఆత్మహత్య 
పెళ్లికి పెద్దలు అంగీకరించరనే అనుమానంతోనే.. 
సిద్దిపేట జిల్లాలో ఘటన

కొండపాక, సిద్దిపేట టౌన్‌: పెళ్లికి ఇరు కుటుంబాల వారూ అంగీకరించరనే అనుమానంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామంలో గురువారం వెలుగు చూసింది. ప్రేమికులిద్దరూ తాము చదువుకున్న పాఠశాల తరగతి గదిలోనే.. తొలుత పురుగుమందు తాగి అనంతరం ఒకే కొక్కానికి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. కుకునూరుపల్లి ఎస్‌ఐ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన ముంజె కనకయ్య (21), అదే గ్రామానికి చెందిన రాచకొండ తార (19) తొమ్మిదో తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివారు. కనకయ్య తొమ్మిదో తరగతి తరువాత చదువు మానేయగా.. తార పదోతరగతి పూర్తి చేసింది. కనకయ్య కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. యువతి కుట్టుశిక్షణ పొందుతోంది. వీరిద్దరూ మూడేళ్లకు పైగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్ల కిందట వీరి మధ్య గొడవ జరిగింది. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ యువతి తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లగా.. గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పంచాయితీ పెద్దలు కనకయ్య కుటుంబానికి రూ.30 వేల జరిమానా విధించారు. తరువాత కొన్నాళ్లకు వారిద్దరి మధ్య ప్రేమాయణం యథాతథంగా కొనసాగింది. ప్రేమికులిద్దరివీ వేర్వేరు కులాలు కావడం, పెళ్లికి పెద్దలు అంగీకరించే పరిస్థితి లేకపోవడంతో మానసికంగా కుంగిపోయారు. ఇక తమ పెళ్లి జరగదనే భావనతో కలసి చనిపోదామనే నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఇళ్లనుంచి బయల్దేరి గతంలో తాము చదివిన పాఠశాలకు వచ్చి ఇద్దరూ పురుగుమందు తాగారు. ఆ తరువాత తాము చదువుకున్న తరగతి గదిలో ఒకే కొక్కానికి తాడుతో ఉరి వేసుకున్నారు. విషయం     గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.