close

తాజా వార్తలు

లంక పేలుళ్ల కేసులో ఉపాధ్యాయులు అరెస్ట్‌

కొలంబో: గత నెల 21న శ్రీలంకలోని చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా చేసుకొని జరిగిన పేలుళ్ల కేసు దర్యాప్తును శ్రీలంక పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ దాడులతో సంబంధమున్న సుమారు 70 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. గురువారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నేషనల్‌ తావీద్‌ జమాత్‌ (ఎన్‌టీజే) ఉగ్రవాద సంస్థతో సంబంధమున్నట్లు భావిస్తున్న నూర్ మహమ్మద్‌ అనే ఓ పాఠశాల ప్రిన్స్‌పాల్‌తో పాటు అజిబుల్‌ జాబర్‌ అనే ఉపాధ్యాయుడుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

అటవీరవేవలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వీరిని హొరోపఠానా నగరంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరికి ఎన్‌టీజే ఉగ్ర సంస్థతో పాటు ఆ సంస్థ నాయకుడు మహమ్మద్‌ సహ్రాన్‌ హసీమ్‌తో నేరుగా సంబంధాలున్నాయన్న సమాచారంతో వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. అనంతరం కెబితిగొల్లెవ మెజిస్ట్రేట్‌ కోర్టుకు వారిని తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పవిత్ర ఈస్టర్ పర్వదినం నాడు జరిగిన ఈ పేలుళ్లలో సుమారు 260 మంది మృతి చెందగా, దాదాపు 500 మంది గాయాల పాలయ్యారు. ఈ పేలుళ్లు తమ సంస్థ పనేనని నిషేధిత ఉగ్ర సంస్థ ఐసిస్‌ ప్రకటించుకోగా, శ్రీలంక ప్రభుత్వం మాత్రం స్థానిక ఉగ్రవాద సంస్థ ఎన్‌టీజీ సంస్థ ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తోంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.